RCB vs MI Super Over: ఇషాన్ కిషన్‌ను అందుకే బ్యాటింగ్‌కు పంపలేదు: రోహిత్ శర్మ 

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ ఓవర్‌ (RCB vs MI Super Over In IPL 2020)లో విజయాన్ని అందుకుంది. అయితే 99 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ను పక్కనబెట్టి హార్ధిక్ పాండ్యాను బ్యాటింగ్‌కు ఎందుకు పంపించారో రోహిత్ శర్మ వెల్లడించాడు.

Last Updated : Sep 29, 2020, 08:52 AM IST
RCB vs MI Super Over: ఇషాన్ కిషన్‌ను అందుకే బ్యాటింగ్‌కు పంపలేదు: రోహిత్ శర్మ 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ సీజన్‌లో 10వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore ), డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌లో విరాట్ కోహ్లీ సేన విజయం సాధించింది. అయితే సూపర్ ఓవర్‌లో ముంబై ఇండియన్స్  (Mumbai Indians) జట్టు ఇషాన్ కిషన్‌ను బ్యాటింగ్‌కు ఎందుకు పంపలేదనే విమర్శలు రాకముందే కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. 

ఇషాన్ కిషన్ అప్పటికే బాగా అలసిపోయి ఉన్నాడని, అందుకే అతడిని మళ్లీ బ్యాటింగ్‌కు పంపలేదని, సూపర్ ఓవర్‌లో ఫీల్డింగ్ కూడా చేయించలేదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వాస్తవానికి మేం అంత గొప్పగా మ్యాచ్ ప్రారంభించలేదని, అయితే ఇషాన్‌ కిషన్‌ (99; 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్స్‌లు), కీరన్ పోలార్డ్‌ (60 నాటౌట్‌; 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) మ్యాచ్ తమవైపు తిప్పారని చెప్పాడు. మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఈ విషయాలు ప్రస్తావించాడు. 

అప్పటికే బాగా అలసిపోయిన ఇషాన్ కిషన్ సూపర్ ఆడేందుకు అంతగా సౌకర్యవంతంగా కనిపించలేదన్నాడు. కీరన్ పోలార్డ్ మంచి ఫామ్‌లో ఉన్నాడు కానీ ఇషాన్ కిషన్‌లా అలసిసోలేదు. దాంతో మేం పోలార్డ్ తో పాటు బ్యాటింగ్‌కు దిగని హార్ధిక్ పాండ్యాను బ్యాటింగ్‌కు పంపినట్లు పేర్కొన్నాడు. హిట్టింగ్ చేస్తాడని పాండ్యాను పంపించాం, కానీ అన్ని మనం అనుకున్నట్లుగా జరగవు కదా అని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ వివరించాడు. 

 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News