Ex CM YS Jagan: మాజీ సీఎం జగన్ కు 30 మందితో ప్రైవేటు సెక్యురిటీ ఫోర్స్.. వీడియో వైరల్..
Tadepalli: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తాడేపల్లి లో ప్రైవేటు సెక్యురిటీవారిని తనకు ప్రొటెక్షన్ గా నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన నివాస స్థలం వద్ద పోలీసుల పహారాను ప్రభుత్వం తొలగించింది.
YS Jagan Residence in Tadepalli: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు కూటమికి భారీ మెజార్టీని ఇచ్చి దీవించారు. ఇటీవల చంద్రబాబు తోపాటు, 24 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత చంద్రబాబు తన మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు కీలకమైన డిప్యూటీ సీఎంతో పాటు, మరో నాలుగు శాఖలను కూడా చంద్రబాబు కేటాయించారు. మరోవైపు ఇప్పటికే చంద్రబాబు రంగంలోకి దిగారు. గత ప్రభుత్వం పాలించిన ఐదేళ్లలో ఏపీ అన్నిరంగాలలో వెనక్కు వెళ్లి పోయిందని చంద్రబాబు అనేక సార్లు విమర్శించారు. జనసేనాని కూడా ఏపీ డెవలప్ మెంట్ కావాలంటే.. అందరు కలిసి ఒకరికి మరోకరు సహకరించుకొవాలని కోరారు.
ఇక ఏపీలో కూటమి, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో ఏపీకి భారీగా నిధులు సమకూరుతాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. వైఎస్ జగన్ తాను సీఎంగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలను, కొత్త ప్రభుత్వం ఒక్కొక్కటిగా బైటకు తీస్తుంది. అధికారాన్ని, హోదాలను అడ్డంపెట్టకుని వైసీపీ నేతలు చేసిన ప్రతి మోసాలు, అక్రమాలను ప్రజల ముందు ఉంచుతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కూటమి భారీ మెజార్టీతో గెలవడం, వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో పలు ప్రాంతాలలో వైసీపీ నేతలకు టీడీపీ వాళ్లు దాడులకు పాల్పడిన ఘటనలు కూడా వార్తల్లో నిలిచాయి.
మాజీ మంత్రులు, కోడాలినాని, పేర్నినాని, మరికొందరు బీజేపీ నేతలు.. ప్రెస్ మీట్ పెట్టి మరీ గవర్నకు వినతపత్రం ఇచ్చారు. తమకు సెక్యురిటీ కల్పించాలని కూడా పోలీసులను ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. ఇటీవల ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నివాసముంటున్న తాడేపల్లి వద్ద ప్రభుత్వం బందోబస్తును తొలగించింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తనకు సెక్యురిటీగా ప్రైవేటు వారిని నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రైవేటు సంస్థకు చెందిన 30 మంది భద్రత సిబ్బంది జగన్ ఇంటి వద్ద నిరంతరం పహరా కాస్తుంటారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భధ్రత సిబ్బంది బ్లాక్ డ్రెస్సులో, తాడేపల్లి జగన్ ఇంట్లోకి వెళ్లున్నారు. వీరంతా నిరంతరం జగన్ కు స్పెషల్ గా సెక్యురిటీ ఇస్తారు.
ఇదిలా ఉండగా.. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం ముందు నుంచి సామాన్య ప్రజలు వెళ్లకుండా పోలీసులు ఆ ప్రాంతంలో కఠినమైన ఆంక్షలు విధించారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. దాదాపు 1.5 కిలో మీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వచ్చేది. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ఇంటి ముందున్న రోడ్డుపై ఆంక్షలు తొలగించింది. దీంతో ఆ రోడ్డు ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు అందుబాటులోకి వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter