Tuition Teacher: ఒక టీచర్ వల్ల 14 మంది పిల్లలకు కరోనా..
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ కోట్లాది మందిని ప్రభావితం చేస్తోంది. వివిధ దేశాలు, వైద్య సంస్థలు, ఆరోగ్య విభాగాలు చురుకుగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 ( Covid-19 ) వైరస్ కోట్లాది మందిని ప్రభావితం చేస్తోంది. వివిధ దేశాలు, వైద్య సంస్థలు, ఆరోగ్య విభాగాలు చురుకుగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. దాంతో పాటు అవసరం లేని ఎలాంటి మానవ సమావేశాలు నిర్వహించడం కరెక్ట్ కాదు అని అన్ని ప్రభుత్వాలు చెబుతున్నాయి.
ALSO READ| PM Kisan Samman: రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 2000 నజరానా..దరఖాస్తు ఇలా చేయండి
స్కూల్స్, కాలేజీలు కూడా క్లోజ్ చేశారు. అయితే ఇంతా చేసినా.. ప్రపంచం మొత్తం విలవిల్లాడుతున్నా కొంత మంది మాత్రం ఇంకా మారడం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ( Guntur ) జిల్లా భట్లూరు గ్రామంలో ఒక టీచర్ వల్ల సుమారు 14 పిల్లలు వారి తల్లిదండ్రుల్లో కొందరికి కరోనావైరస్ సోకింది.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ వల్లే పిల్లలకు కరోనావైరస్ ( Coronavirus ) రావడం అనేది నూటికి నూరు శాతం నిర్లక్షమే. ప్రభుత్వం ఒక వైపు స్కూల్స్ కాకుండా ఆన్ లైన్ క్లాసుల కోసం ప్రయత్నిస్తోంటే.. ఒక ఇంగ్లిష్ కాలేజీ లో ఇంగ్లీష్ లెక్చరర్ తన ఇంట్లో క్లాసులు నిర్వహిస్తున్నారు. అతని భార్య గర్భిణీ కావడంతో వైద్యులు కోవిడ్ -19 పరీక్షలు చేయమని సూచించారు.
ALSO READ| Online Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి
టెస్టులు నిర్వహించగా ఆమెకు కరోనా నిర్ధారణ జరిగింది. ఆమెకు డిలవరీ అయిన తరువాత సదరు లెక్చరర్ కు ఆరోగ్యం పాడయింది. తరువాత ట్యూషన్ కు వచ్చిన పిల్లలకు కూడా పరీక్షలు చేయగా వారిలో 14 మందికి కోవిడ్-19 నిర్ధారణ జరిగింది.
ఇందులో కొంత మంది విద్యార్థులు కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకింది. ఇప్పటి వరకు భట్లూరులో 39 మందికి కరోనావైరస్ సోకడంతో క్వారైంటైన్ కు తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR