ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో 648 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 13 జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టారు. తగిన అర్హత కలిగిన ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.



 


బీఎస్సీ(న‌ర్సింగ్‌), బీఎస్సీ (ఎంఎల్‌టీ), బీఫార్మసీ, ఫార్మా-డి, ఎంఫార్మసీ, ఎమ్మెస్సీ (న‌ర్సింగ్) విద్యార్హత‌, కంప్యూట‌ర్ స్కిల్స్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆరోగ్యమిత్ర పోస్టులకు రూ.12,000, టీం లీడ‌ర్ పోస్టులకు రూ.15,000 మేర నెల వేతనం అందనున్నాయి.   దరఖాస్తు తుది గడువు : అక్టోబర్ 31


నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫామ్ కోసం క్లిక్ చేయండి
 


జిల్లాల వారీగా పోస్టులు, వివరాలు ఇలా ఉన్నాయి..
1) విజయనగరం: 13 పోస్టులు
 ఆరోగ్యమిత్ర-12, టీం లీడ‌ర్స్‌-01


2) శ్రీకాకుళం: 15 పోస్టులు
 ఆరోగ్యమిత్ర-14, టీం లీడ‌ర్స్‌-01


3) విశాఖపట్నం: 34 పోస్టులు
ఆరోగ్యమిత్ర-29, టీం లీడ‌ర్స్‌-05


4) పశ్చిమగోదావరి: 27 పోస్టులు
ఆరోగ్యమిత్ర-24, టీం లీడ‌ర్స్‌-03


5) తూర్పుగోదావరి: 77 పోస్టులు
ఆరోగ్యమిత్ర-70, టీం లీడ‌ర్స్‌-07


6) కృష్ణా: 62 పోస్టులు
ఆరోగ్యమిత్ర-55, టీం లీడ‌ర్స్‌-07


7) గుంటూరు: 73 పోస్టులు
ఆరోగ్యమిత్ర-65, టీం లీడ‌ర్స్‌-08


8) ప్రకాశం: 60 పోస్టులు
ఆరోగ్యమిత్ర-54, టీం లీడ‌ర్స్‌-06


9) నెల్లూరు: 50 పోస్టులు
ఆరోగ్యమిత్ర-44, టీం లీడ‌ర్స్‌-06


10) కర్నూలు: 59 పోస్టులు
ఆరోగ్యమిత్ర-57, టీం లీడ‌ర్స్‌-02


11) వైఎస్సార్ కడప: 58 పోస్టులు
ఆరోగ్యమిత్ర-54, టీం లీడ‌ర్స్‌-04


12) చిత్తూరు: 71 పోస్టులు
ఆరోగ్యమిత్ర-68, టీం లీడ‌ర్స్‌-03


13) అనంతపురం: 49 పోస్టులు
ఆరోగ్యమిత్ర-44, టీం లీడ‌ర్స్‌-05


అధికారిక వెబ్‌సైట్
 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe