Pothula Sunitha Resignation: టీడీపీకి మరో షాక్.. ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా

Pothula Sunitha Resigns To her MLC Post  | ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (TDP)కి మరో షాక్ తగిలింది. పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గత 15 నెలలుగా అనుసరిస్తున్న విధానాలను విభేదిస్తూ రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.

Last Updated : Oct 28, 2020, 02:41 PM IST
  • టీడీపీకి మరో షాక్.. ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా
  • శాసనమండలి చైర్మన్‌కు పోతుల సునీత రాజీనామా లేఖను పంపించారు
  • ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు మద్దతు
Pothula Sunitha Resignation: టీడీపీకి మరో షాక్.. ఎమ్మెల్సీ పదవికి పోతుల సునీత రాజీనామా

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (TDP)కి మరో షాక్ తగిలింది. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత (Pothula Sunitha) తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గత 15 నెలలుగా అనుసరిస్తున్న విధానాలను విభేదిస్తూ రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్‌కు పోతుల సునీత తన రాజీనామా లేఖ (Pothula Sunitha Resignation Letter)ను పంపించారు. శాసనమండలిని టీడీపీ రాజకీయ వేదికగా మార్చేసిందని పోతుల సునీత గతంలో మండిపడ్డారు.

 

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనకు మద్దతుగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోతుల సునీత తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి తరువాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. అయితే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌లు రాష్ట్రంలో సంక్షేమ పథకాలను, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

 

కాగా, ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు టీడీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలతో పాటు పదవులు సైతం వదులుకుని కొందరు టీడీపీ నేతలు అధికార వైసీపీలోకి చేరడం తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనకు మద్దతు తెలుపగా పోతుల సునీతపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో టీడీపీకే ట్విస్ట్ ఇస్తూ.. ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. త్వరలో వైఎస్సార్‌పీపీలో చేరనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x