Rajya Sabha Election: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల సమరం.. ఈసీ షెడ్యూల్ విడుదల
6 Rajya Sabha Seats Bypoll Schedule Release: ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల సమరం వచ్చేసింది. రాజీనామాలు చేయడంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
Rajya Sabha Elections: శాసనసభ, సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికల సమరం దూసుకొచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన నేపథ్యంలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తూ భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో ఖాళీ అయిన మూడు స్థానాలతోపాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానాలోని ఒక్కో స్థానానికి ఎన్నికల సంఘం ఎన్నిక చేపట్టనుంది.
ఇది చదవండి: AP Real Estate: ఏపీలో రియల్ ఎస్టేట్‌కు బూస్ట్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
దేశంలోని మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తూ మంగళవారం ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో మూడు రాజ్యసభ సీట్లతోపాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానాలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరపాలని ఈసీ నిర్ణయించింది. వైఎస్సార్‌సీపీ నుంచి రాజ్యసభ స్థానం పొందిన మోపిదేవి వెంకట రమణా రావు, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్య కొన్ని నెలల కిందట రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
ఇది చదవండి: YS Sharmila: గౌతమ్ అదానీతో జగనన్న 'లంచం' ఒప్పందాన్ని రద్దు చేయండి
షెడ్యూల్ ఇలా..
మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ డిసెంబర్ 3వ తేదీన విడుదల కానుంది. 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 11వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టి 13వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ప్రకటించింది. డిసెంబర్ 20వ తేదీన పోలింగ్ చేపట్టనుండగా.. అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి కౌంటింగ్ చేపడతారు.
ఎన్డీయే ఖాతాలోకే?
మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆరు స్థానాలు కూడా ఎన్డీయే ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు హర్యానా, ఒడిశాలో ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్న విషయం తెలిసిందే. సంఖ్యాబలంగా బీజేపీతోపాటు తన మిత్రపక్షాలు బలంగా ఉండడంతో ఆయా స్థానాలన్నీ ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. బీజేపీ ఒత్తిడితో ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయడంతో వైఎస్సార్‌సీపీకి చెందిన స్థానాలన్నీ టీడీపీ లేదా బీజేపీ పంచుకునే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.