Gautam Adani Bribe: దేశవ్యాప్తంగా గౌతమ్ అదానీ లంచం ఆరోపణల అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపుతుండగా ఆ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌కు లింక్ ఉండడంతో మరింత వివాదం రాజుకుంది. ఈ వ్యవహారంలో వైఎస్ షర్మిల సంచలన లేఖ రాశారు. తన సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో డిమాండ్ చేశారు. అదానీతో జగన్ మోహన్ రెడ్డి చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం తక్షణం రద్దు చేయాలని కోరారు. అక్రమ ఒప్పందంతో ప్రజలపై రూ. 1.50 లక్షల కోట్లు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది చదవండి: New Ration Cards: ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డులు, ఇలా అప్లై చేసుకోండి
గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూపుతో సీఎంగా వైఎస్ జగన్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. గౌతమ్ అదానీ నుంచి రూ.1,750 కోట్ల ముడుపులు అందుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గౌతమ్ అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరించాడు. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల స్పందిస్తూ ఏపీ ప్రభుత్వం కూడా ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కోరుతూ సోమవారం లేఖ రాశారు.
ఇది చదవండి: Kissik Song: ఏపీ రాజకీయాల్లో పుష్ప 2 'కిస్సిక్' పాట రచ్చ.. వారికి అల్లు అర్జున్ స్ట్రాంగ్ వార్నింగ్?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై వెంటనే సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్ షర్మిల సంచలన డిమాండ్ చేశారు. అదానీకి చెందిన గ్రీన్ ఎనర్జీ కంపెనీతో 2021లో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుని వైఎస్ జగన్ అండ్ కో బృందానికి రూ.1,750కోట్లు నేరుగా లంచాలు ముట్టాయని అమెరికా కోర్టులో తీవ్ర అభియోగాలు మోపాయని లేఖలో వివరించారు. అదానీ దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే.. మాజీ సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్ర పరువును తీశారని విమర్శించారు. లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ, జగన్ మధ్య జరిగిన వ్యాపార లావాదేవిలు మొత్తం రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచుకొనే భారీ కుంభకోణంగా అభివర్ణించారు.
'అదానీతో జగన్ రూ.1750కోట్ల లంచాలకు ఆశపడి చేసుకున్న ఒప్పందానికి రాష్ట్రం నెత్తిన పడే భారం రూ.1.50 లక్షల కోట్లు' అని షర్మిల వివరించారు. ఇప్పటికే సర్దుబాటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.17 వేల కోట్ల భారం మోపారని గుర్తుచేశారు. అదానీతో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై దర్యాప్తు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.