Lady Aghori: ట్రెండ్ మార్చిన అఘోరీ..?.. సడెన్‌గా గడ్డం, మీసాలతో హల్ చల్.. ఎక్కడంటే..?
Lady Aghori halchal: లేడీ అఘోరీ మళ్లీ హల్ చల్ చేసినట్లు తెలుస్తొంది. ఆమె తాజాగా కర్నూల్ లో ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
Aghori with beard and mustache new look goes viral: తెలుగు రాష్ట్రాల ప్రజలకు లేడీ అఘోరీ చుక్కలు చూపిస్తుందని చెప్పుకొవచ్చు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో లేడీ అఘోరీ చేసిన పనులకు పోలీసులు సీరియస్ అయ్యారు. ఆమెను తాళ్లతో బంధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లేడీ అఘోరీని మరల వార్నింగ్ ఇచ్చి వదిలి వేసినట్లు తెలుస్తొంది. ఎప్పుడైతే సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఘటన వెలుగులోకి వచ్చిందో.. లేడీ అఘోరీ అక్కడికి వచ్చింది.
అక్కడ పూజలు చేసి విగ్రహాలను ధ్వంసం చేసిన వాళ్లను నాశనం చేస్తానని రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత ఎక్కవ తెలంగాణలో ఆలయాల ధ్వంసం జరిగిన కూడా.. వాటిపై మాట్లాడింది. సనాతన ధర్మం కోసం తన ప్రాణాలు సైతం అర్పిస్తానని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా.. అఘోరీ తెలంగాణ సీఎం రేవంత్ కు చుక్కలు చూపించిందని చెప్పుకొవచ్చు. ఆయనను ఆలయాలపై దాడుల ఘటనల్ని ఆపకపోతే కుర్చీ నుంచి దిగిపోవాలని కూడా వార్నింగ్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలో అఘోరీ ప్రస్తుతం ఏపీలో కూడా దేవాలయాల్ని సందర్శించింది. అక్కడ వివాదాస్పదంగా మాట్లాడుతూ.. పెంట పెంట చేసింది. తన శూలంతో ఒక విలేకరిపై, పోలీసులపై కూడా దాడికి పాల్పడింది. ఈ క్రమంలో పోలీసులు ఆమెను తాళ్లతో బంధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. లేడీ అఘోరీ గుజరాత్ కు వెళ్లిపోయిందని తెలుస్తొంది. అయితే.. ఏంటో.. మరల అఘోరీ ఏపీలో తెలింది. కర్నూల్ లో అఘోరీ కారులో హల్ చల్ చేసింది. ఈ సారి అఘోరీ కాస్త కొత్త లుక్ తో కన్పించినట్లు తెలుస్తొంది.
Read more: Viral Video: అమ్మ బాబోయ్.. క్యాలీ ఫ్లవర్లో కూడా పాము.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఇదే..
సడెన్ గా గడ్డం, మీసాలతో అఘోరీ కొత్తగా కన్పించింది. దీంతో ఒక్కసారిగా అందరు షాక్ కు గురయినట్లు సమాచారం. ఆమెను కొంత మంది స్థానికులు అడ్డగించి వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తొంది. నిమ్మకాయలతో ఏం చేస్తున్నావని ఆమెతో గొడవకు దిగారు. దీంతో అక్కడ కారులోనే ఉండి అఘోరీ వారితో మాట్లాడింది. కానీ స్థానికులు మాత్రం అఘోరీ పనులపై సీరియస్ అయినట్లు తెలుస్తొంది. ఒకప్పుడు నగ్నంగా బట్టలు లేకుండా కన్పించిన అఘోరీ ఒక్కసారిగా.. గడ్డం, మీసాలతో ఉన్న కొత్త లుక్ మాత్రం వైరల్ గా మారిందని చెప్పుకొవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.