Viral Video: అమ్మ బాబోయ్.. క్యాలీ ఫ్లవర్లో కూడా పాము.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఇదే..

Snake Video: కాలీఫ్లవర్ లో ఒక పాము బైటపడింది. దీంతో ఇంట్లొ వాళ్లు భయంతో పరుగులు పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ కు గురౌతున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Nov 20, 2024, 08:46 PM IST
  • కాలీఫ్లవర్ లో పాము..
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్..
Viral Video: అమ్మ బాబోయ్.. క్యాలీ ఫ్లవర్లో కూడా పాము.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఇదే..

snake found in cauliflower video viral: సాధారణంగా మనిషన్న వారికి ఎవరికైన పామంటే చచ్చేంత భయం ఉంటుంది. అసలు పాములు చూసి చాలా మంది ఆమడదూరం పారిపోతారు. పాములు ఎక్కువ మట్టుకు.. మనుషులున్న చోటకు రావు. కానీ ఎలుకల వేటలో కొన్నిసార్లు మాత్రం కొన్నిసార్లు మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. పాములను హని తలపెడితే లేనీ పోనీ దోషాలు వస్తాయంట. అంతే కాకుండా పాముల నుంచి చాలా మంది ఎంతో జాగ్రత్తగా ఉంటారు. పాములకు చెందిన వెరైటీ వీడియో ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vimla Meena (@vimla9573)

 

కొన్ని వీడియోలు చూస్తే భయంకరంగా ఉంటే.. మరికొని మాత్రం విస్తుపోయే విధంగా ఉంటాయి. పాములు ఇప్పటి వరకు బట్టలలో, బెడ్ షీట్ లలో, హెల్మెట్ లలో, కార్ లలో ఉండటం చూశాం. కానీ ఇక్కడ ఒక పాము మాత్రం కాలీఫ్లవర్ లో దూరి కూర్చుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఒక ఇంట్లో కాలీఫ్లవర్ ను తీసుకొచ్చారు. మరీ దానిలో వాళ్లు ఒక పామును గుర్తించారు. వెంటనే కాలీఫ్లవర్ ను నెమ్మదిగా కట్ చేసి పామును వేరు చేశారు. అది చిన్నగా ఉన్న కూడా బుసలు  కొడుతుంది. పాము మాత్రం నల్లగా చూసేందుకు భయం కలిగించే విధంగా ఉంది. అక్కడున్న వారు ఈ ఘటన చూసి దూరంగా వెళ్లిపోయినట్లు తెలుస్తొంది.

Read more: Viral Video: స్మిత గారు.. మీకోసమే అంటూ ఎక్స్ లో పోస్ట్... నెట్టింట రచ్చగా మారిన వీడియో.. ఏముందంటే..?

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ అవుతున్నారు. కూరగాయాలలో పురుగులు చూశాం.. కానీ ఏకంగా పాములు ఏంట్రా బాబోయ్ అంటు షాక్ అవుతున్నారంట. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.   ఇదిలా ఉండగా.. గతంలో ఒక పాము పొలంలో టమాటాను కాటు వేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది.

పాము కసితీర టమాటాను కాటు వేసింది. పొరపాటున ఆ టమాటా ఎవరైన తింటే పరిస్థితి ఏంటని నెటిజన్ లు ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా..ఇప్పుడు వీరు పామును చూశారు కాబట్టి సరిపోయింది. మరీ చూడకపోతే.. ఎమయ్యేదో అని టెన్షన్ కు గురౌతున్నారు. మరీ కాలీ ఫ్లవర్ లో పాము ఏంటని కొందరు వింతగా చూస్తున్నారు.
 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x