Hyderabad Dentist Kidnap Case: హైదరాబాద్ వైద్యుడి కిడ్నాప్ కేసును ఛేదించిన ఏపీ పోలీసులు
AP police rescued Hyderabad Dentist | డాక్టర్ కిడ్నాప్ కేసు నగరంలో కలకలం రేపింది. అయితే 24 గంటలు గడిచేలోగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్ డాక్టర్ కిడ్నాప్ కేసును ఛేదించారు. బెంగళూరు వైపు తీసుకెళ్తుండగా అనంతపురం పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ డాక్టర్ కిడ్నాప్ కేసు (Hyderabad Dentist Kidnap Case) నగరంలో కలకలం రేపింది. అయితే 24 గంటలు గడిచేలోగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ కిడ్నాప్ కేసును ఛేదించారు. రాజేంద్రనగర్‌లో కిడ్నాప్ అయిన దంతవైద్యుడ్ని బెంగళూరు వైపు తీసుకెళ్తుండగా అనంతపురం పోలీసులు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఎక్సైజ్ కాలనీలో నివాసం ఉంటున్న బెహజత్ హుస్సేన్ (57) దంతవైద్యుడిగా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్సైజ్ కాలనీలో నిన్న సాయంత్రం హుస్సేన్ కిడ్నాప్ (Dentist Kidnap)నకు గురయ్యారు.
Also Read : TS EdCET 2020 Results: టీఎస్ ఎడ్‌సెట్ 2020 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బురఖాలో వచ్చి డెంటిస్ట్ హుస్సేన్‌ను కిడ్నాప్ చేశారని పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి ఏపీ పోలీసులకు సైతం హైదరాబాద్ పోలీసులు సమాచారం అందించారు. వారి అంచనానే నిజమైంది. హుస్సేన్ ఓ వాహనంలో కిడ్నాపర్లు బెంగళూరు వైపు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రాత్రి నుంచి 44వ జాతీయ రహదారిపై కాపలాకాసిన పోలీసులు రాప్తాడు సమీపంలో కిడ్నాపర్లను అడ్డుకున్నారు.
Also Read : Telangana: కొత్తగా 1481 కరోనా పాజిటివ్ కేసులు
ఇద్దరు దుండగులను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారయ్యారని సమాచారం. అనంతపురం జిల్లాలో అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేయడంతో డెంటిస్ట్ హుస్సేన్ కేసును ఛేదించగలిగామని ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. రాప్తాడు పోలీస్ స్టేషన్‌కు నిందితులను తరలించినట్లు సమాచారం. నిందితుల వద్ద నుంచి ఓ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కిడ్నాప్ సమయంలో డెంటిస్ట్ దగ్గర అసిస్టెంట్‌గా ఉన్న యువకుడిపై బురఖాలో వచ్చిన కిడ్నాపర్లు దాడి చేశారు. అనంతరం ఆ యువకుడ్ని బాత్రూమ్‌లో బంధించి ఇన్నోవా వాహనంలో హుస్సేన్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే తనను నిందితులు ఎందుకు కిడ్నాప్ తెలియదని డెంటిస్ట్ హుస్సెన్ చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe