Chandrababu naidu: ఏమాత్రం వెనక్కు తగ్గని చంద్రబాబు.. ఈ సారి రాయలసీమ.. దేశంలోనే తొలి సీఎంగా రికార్డు..
Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పాలనను గాడిలో పెట్టే పనిలో బిజీగా ఉంటున్నారు. అధికారులతో నిరంతరం సమావేశాలు, రివ్యూలు నిర్వహిస్తున్నారు.
AP cm Chandrababu naidu tour to sri Sathya sai district madakasira: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి భారీమెజార్టీ అందించారు. సీఎంగా చంద్రబాబు,డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రజలకు చక్కని పాలన అందిస్తున్నారు. ఒక వైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలపై శ్వేత పత్రాలను విడుదల చేస్తున్నారు. మరోవైపు ఏపీని ఏ విధంగా డెవలప్ చేయాలో అనే దానిపైన కూడా ప్రత్యేకంగా చర్చలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం పెన్షన్ లు,పథకాల పంపిణి కోసం వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతినెల ఒకటో తేదీన గతంలో వాలంటీర్లు వెళ్లి, లభ్ది దారులకు పెన్షన్ లు ఇస్తుండే వారు. వాలంటీర్లు లేకుండా పథకాలు, ప్రజలకు అందించలేమని కూడా గత ప్రభుత్వ నేతలు పలుమార్లు చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు మాత్రం వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకోకుండానే లబ్ధిదారులకు పెన్షన్ లను పంపణిచేస్తున్నారు. గత నెలలో ఒకటో తారీఖున ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు.. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉదయం ఆరుగంటలకే లబ్ధిదారు ఇంటికి వెళ్లి మరీ పింఛన్ లను అందించారు. ఒక పథకానం ప్రయోజనాల్ని లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఇచ్చిన మొదటి సీఎంగా చంద్రబాబు అరుదైన రికార్డు క్రియేట్ చేశారు. అదే విధంగా ఏపీ వ్యాప్తంగా సచివాయం సిబ్బంది.. ఎక్కడిక్కడ లబ్ధిదారులకు పెన్షన్ లను అందజేశారు. ఈనేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు ఆగస్టు నెలలో కూడా పెన్షన్ ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు మొదటి తారీఖున.. శ్రీసత్యసాయి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఆరోజున మడక సిరలో పెన్షన్ లను పంపిణి చేయనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గం గుండుమలలో పర్యటిస్తారు. ఆ రోజు వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి సవిత, ఎమ్మెల్యేలు ఎమ్మెస్ రాజు, సింధూర రెడ్డి, కందికుంట వెంకటప్రసాద్ జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్నలు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సీఎం చంద్రబాబు పర్యటనలో ఎలాంటి లోపాలులేకుండా చూడాలన్నారు. ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా పెద్ద ఎత్తున పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని టీడీపీ నేతలు అన్నారు.
Read more: Tirumala: తిరుమలలో శ్రావణ మాస ఉత్సవాలు.. ఆగస్టు నెలలో జరిగి విశేష వేడుకల డిటెయిల్స్ ఇవే..
పింఛన్ల పంపిణీకి సంబంధించి ఆగస్టు 1న ఉదయం ఆరు గంటలకే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. మొదటి రోజు 99 శాతం పింఛన్ల పంపిణీ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా మిగిలితే మరుసటి రోజు పంపిణీ చేస్తారని సమాచారం. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ఇప్పటికే పింఛన్ల పంపిణీకి మ్యాపింగ్ కూడా పూర్తి చేశారు. మరోవైపు ముందుగానే పింఛన్లకు సంబంధించిన డబ్బుల్ని ఆయా జిల్లాల అధికారులకు పంపించారు. ఈ నెల 31న డబ్బుల్ని విత్ డ్రా చేసి సచివాలయాల సిబ్బందికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter