ఇసుక పాలసీపై ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అమ్మకాల విషయంలో నూతన పాలసీ అమల్లోకి వచ్చేవరకూ ఉచిత ఇసుక సరఫరా బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అమ్మకాల విషయంలో నూతన పాలసీ అమల్లోకి వచ్చేవరకూ ఉచిత ఇసుక సరఫరా బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. పేదల గృహాల నిర్మాణాలు, ఇతర అవసరాలకు జిల్లా కలెక్టర్ల అనుమతితో ఇసుక సరఫరా చేసేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్లను నోడల్ ఆఫీసర్‌లుగా నియమించిన ప్రభుత్వం.. ఇసుక అక్రమ రవాణా, ఇసుక వ్యాపారం, ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలిస్తున్న వ్యాపార ముఠాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.