Jagananna Vidya kanuka: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోగన్ రెడ్డి మరో సంక్షేమ కార్యక్రమాన్ని ప్రకటించారు. రెండు నెలల్లో విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు అందిస్తామని తెలిపారు. 8వ తరగతి నుంచి ఆ పై తరగతుల విద్యార్థులకు సెప్టెంబర్ లో ల్యాప్ ట్యాప్ లు పంపిణి చేస్తామని తెలిపారు. కర్నూల్ జిల్లాలో అదోనిలో జనగన్న విద్యా కానుక మూడో విడత పథకాన్ని ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన జగన్... గత మూడేళ్లలో విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. కార్పొరేట్‌ స్కూళ్లను మరిపించేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యను అందించేందుకు మౌలిక వసతులు కల్పించామని సీఎం జగన్ వెల్లడించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పేదరికం నుంచి బయటపడాలంటే ప్రతి ఇంట్లో ఉన్నత విద్యావంతుడు ఉండాలన్నారు జగన్. అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలన్నారు. పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి కింద ఏడాదికి 15 వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు, నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ స్కూళ్లను అధునీకరించామని, జగనన్న గోరుముద్ద పథకం ద్వారా  పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని సీఎం జగన్ వివరించారు.  బైజూస్‌ యాప్‌ను పేద పిల్లలకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు.తమ ప్రయత్నాలతో ఈసారి సర్కార్ స్కూళ్లలో చేరికలు భారీగా పెరిగాయన్నారు. కొత్తగా దాదాపు 7లక్షల అడ్మిషన్లు వచ్చాయన్నారు.


ఏపీ  ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసింది. ఏపీలో ఇవాళే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజున విద్యార్థులకు జగనన్న విద్యాదివేన కింద కిట్లు అందించారు. ఏపీలోని మొత్తం ప్రభుత్వ, ఎయిడెడ్‌  స్కూళ్లలో చదువుతున్న 47 లక్షల 40 వేల 421 మంది విద్యార్థులకు కిట్లు అందనున్నాయి. జగనన్న విద్యాకానుక పథకం కోసం ఈ ఏడాది 931 కోట్ల రూపాయలను జగన్ సర్కార్ ఖర్చు చేసింది.  ఒక్కో కిట్‌ విలువ  2వేలు. ఇందులో స్కూల్ బుక్స్, నోట్‌ పుస్తకాలు, వర్క్‌బుక్స్‌, 3 జతల యూనిఫామ్‌ క్లాత్‌, జత బూట్లు, సాక్సులు, బెల్ట్‌, స్కూల్‌ బ్యాగ్‌, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ ఉంటుంది.  2022-23 విద్యాసంవత్సర క్యాలెండర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు.


అదోని నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు సీఎం జగన్. స్థానికి ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి వినతి మేరకు ప్రభుత్వ డిగ్రీకాలేజ్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆటోనగర్‌, జగనన్న కాలనీలకు బీటీ రోడ్లు, రోడ్ల విస్తరణ కోసం  50 కోట్ల రూపాయలు మంజూరు చేశారు.


Also Read: Nayanathara - vignesh shivan: చెన్నైలోని పోష్ ఏరియాలో రెండు బంగ్లాలు కొన్న నయనతార..


Also Read: Teegala VS Sabitha: టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. మంత్రి సబితపై తీగల డైరెక్ట్ అటాక్.. కాంగ్రెస్ లోకి జంప్? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook