ఏపీలో ఒక్కరోజులో ఏకంగా 7 కరోనా మరణాలు
Andhra Pradsh CoronaVirus Cases | తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కరోనా మహమ్మారి బుసలు కొడుతోంది. రోజుకు వందలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఏపీలో ఏడుగురు కరోనా బారిన పడి మరణించడం గమనార్హం.
ఏపీలో కరోనా వైరస్(CoronaVirus Cases In AP) తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఇందులో 447 కేసులు రాష్ట్రంలో ఉన్నవారికి కాగా, మిగతా 76 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిలో నిర్ధారించారు. తాజా కేసులతో కలిపితే ఏపీలో కరోనా కేసులు(AP COVID19 Cases) 10,884కు చేరుకున్నాయి. భారత్‌లో రికార్డులు బద్దలు కొడుతున్న కరోనా
రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులకు గాను 4,988 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 5,769 యాక్టీవ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో ఏకంగా 7 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకూ ఏపీలో మొత్తం 136 మందిని కరోనా మహమ్మారి బలి(AP Fights Corona) తీసుకుంది. నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే SBIలో జాబ్స్
ఏపీలో గడిచిన 24 గంటల్లో 19,085 శాంపిల్స్ పరీక్షించగా మొత్తం 553 మందికి కోవిడ్19(COVID19) పాజిటివ్‌గా నిర్ధారించారు. అదే సమయంలో 118 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు. భారత్‌లో ఆడేందుకు బీసీసీఐ హామీ ఇవ్వాలి: పాక్ జట్టు
నేటి వరకు రాష్ట్రంలో మొత్తం 7,69,319 శాంపిల్స్ పరీక్షించగా ఏపీ నుంచి 8,783 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వచ్చినవారిలో 1,730 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 371 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ఈ వివరాలు గురువారం వెల్లడించింది. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ