భారత్‌లో ఆడేందుకు బీసీసీఐ హామీ ఇవ్వాలి: పాక్ జట్టు

2021లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ (ICC T20 World Cup 2021)తో పాటు 2023లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ (2023 ODI World Cup)లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం పాక్ ఆటగాళ్లకు ఈ వరల్డ్ కప్‌లలో పాల్గొనాలంటే ఇబ్బందులు తప్పవు.

Last Updated : Jun 25, 2020, 12:03 PM IST
భారత్‌లో ఆడేందుకు బీసీసీఐ హామీ ఇవ్వాలి: పాక్ జట్టు

రెండు వరల్డ్ కప్‌లలో భారత్ తమకు అవకాశం ఇస్తుందో లేదోనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఆందోళన మొదలైంది. 2021లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ (ICC T20 World Cup 2021)తో పాటు 2023లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ (2023 ODI World Cup)లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం పాక్ ఆటగాళ్లకు ఈ వరల్డ్ కప్‌లలో పాల్గొనాలంటే ఇబ్బందులు తప్పవు. ఈ ప్రపంచ కప్‌లకు ప్రాతినిధ్యం వహించే అవకావమూ రాకపోవచ్చు. ఈ నేపథ్యంలో పీసీబీ డైరెక్టర్ వసీం ఖాన్(Wasim Khan) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పాక్ క్రికెట్ టీమ్‌కు కరోనా పాజిటివ్

ఈ రెండు వరల్డ్ కప్‌లో పాక్ ఆటగాళ్లు ఏ ఇబ్బంది లేకుండా పాల్గొనేలా చేస్తామని భారత్ హామీ ఇవ్వాలంటూ యూట్యూబ్ క్రికెట్ బజ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చర్చకు తెరలేపాడు. ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)ని జోక్యం చేసుకోవాలని కోరినట్లు వసీం ఖాన్ తెలిపాడు. వీసా అంశాలతో పాటు, పాకిస్తాన్ జట్టుకు భారత్‌లో ఏ సమస్య ఉండకుండా చేస్తామని బీసీసీఐ(BCCI) లిఖితపూర్వకంగా రాసివ్వాలని కోరుతున్నాడు.  నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే SBIలో జాబ్స్

ఈ ఏడాది టీ20 జరిగే అవకాశం లేదు...
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్(T20 World Cup 2020) జరిగే అవకాశం లేదన్నాడు. మరోవైపు 2021 టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరుగుతుందా లేక భారత్లో జరుగుతుందా అనే విషయం పెద్ద ప్రశ్నగా ఉందని.. అయితే ఆతిథ్యమిచ్చే అధికారం మాత్రం భారతదేశానికే ఉంది.  ఇదిలాఉంటే కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే టీ-20 ప్రపంచకప్ పై ఇప్పటివరకు క్లారిటీ లేదు.

తదుపరి సమావేశంలో నిర్ణయం..
అయితే పాక్ సూచించిన  విషయాన్ని ఐసీసీ అధికారి ధ్రువీకరించారు. అంతేకాకుండా ఈసారి జరిగే ఐసీసీ ఎక్జిక్యూటివ్ బోర్డు (International Cricket Council) సమావేశంలో తదుపరి టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా నిర్వహిస్తుందా లేక భారత్‌లో జరుగుతుందా అనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

Trending News