Bjp New Strategy: ఏపీలో బీజేపీ భారీ వ్యూహమే పన్నిందా, బీజేపీ పగ్గాలు పవన్ చేతికి ఇవ్వనుందా
Bjp New Strategy: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రానున్న రోజుల్లో సరికొత్త సమీకరణాలు, పరిణామాలు జరగనున్నాయి. ఏపీలో బలమైన ప్రతిపక్షంగా మారేందుకు బీజేపీ కొత్త వ్యూహానికి తెరతీసింది. ఆపరేషన్ పవన్ కళ్యాణ్ అస్త్రాన్ని ప్రయోగించనుంది.
Bjp New Strategy: రానున్న ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపి కూటమి ఖరారైంది. తెలుగుదేశం-జనసేన పార్టీలతో బీజేపీ జత చేరింది. అధికార పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుంటే..ప్రతిపక్షాలు ఒక్కటౌతున్నాయి. అదే సమయంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బీజేపీ కొత్త వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది. అదే ఆపరేషన్ పవన్ కళ్యాణ్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం స్థానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ యోచిస్తోంది. గతంలో ఆ పార్టీ కీలకనేత రామ్ మాధవ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని ఆ భర్తీని బీజేపీ పూర్తి చేస్తుందన్నారు. ఇప్పుడు రానున్న 2024 ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేనలతో బీజేపీ చేరడం వెనుక వ్యూహం ఇదేనని తెలుస్తోంది. అందుకే ఈసారి పవన్ కళ్యాణ్‌ను లోక్‌సభకు పోటీ చేసేలా బీజేపీ ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో వచ్చినా రాకున్నా..కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారం ఖాయమనే వార్తల నేపధ్యంలో కేంద్ర మంత్రిపదవి ఇవ్వవచ్చని సమాచారం.
అంటే పవన్ కళ్యాణ్‌కు కేంద్రమంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఏపీ రాజకీయాల్ని అధికారంతో శాసించే పరిస్థితి ఉటుందనేది బీజేపీ పెద్దల ఆలోచన. రాష్ట్రంలోని బలమైన సామాజికవర్గం నేపధ్యం, ప్రజాకర్షణ కలిగిన నటుడు కావడంతో పవన్ కళ్యాణ్ అయితేనే ఏపీలో పార్టీ ఎదిగేందుకు అవకాశం ఉంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. 2024 పక్కనబెడితే..2029 ఎన్నికల నాటికి బలపడాలనేది పార్టీ వ్యూహంగా ఉంది.
అంటే రానున్న రోజుల్లో 2024 ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్‌కు కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఏపీలో బలపడేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. నాటు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి విలీనం చేసినట్టే ఈసారి జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయవచ్చని తెలుస్తోంది. అప్పుడు రాష్ట్ర బీజేపీ పగ్గాలు పవన్ కళ్యాణ్‌కు అప్పగించి 2029 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా బరిలో దింపవచ్చు. ఇదే ఇప్పుడు బీజేపీ ప్రధాన ఆలోచనగా ఉంది.
Also read: AP Elections 2024: మార్చ్ 17న మూడు పార్టీల ఉమ్మడి సభ, మోదీ హాజరుకానున్నారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook