Eagle: డ్రగ్స్ పై కూటమి సర్కార్ మరో బ్రహ్మాస్త్రం.. ఈగల్ తో కంట్రోల్ అయ్యేనా..!
Eagle: ఆంధ్ర ప్రదేశ్ లో గంజాయి, నాటు సారా, డ్రగ్స్ పై కూటమి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఇందుకు ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్- ఈగల్ రంగంలోకి దిగింది. మొత్తం 459 మంది సిబ్బంది పనిచేసే ఈగల్లో భాగంగా అమరావతిలో రాష్ట్రస్థాయి నార్కోటిక్స్ పోలీసుస్టేషన్ ఏర్పాటయ్యింది.
Eagle: ఇక ప్రతీ జిల్లాకొకటి చొప్పున 26 నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాలు ఉంటాయి. ఈ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఎస్పీగా, తర్వాత సుదీర్ఘకాలం ఇంటెలిజెన్స్ బ్యూరోలో వివిధ హోదాల్లో పనిచేసిన ఐజీ ఆకే రవికృష్ణ ఈగల్ విభాగానికి హెడ్ గా వ్యవహరిస్తారు. అమరావతిలో రెండు, గంజాయి సమస్య తీవ్రంగా ఉన్న ఏవోబీలోని విశాఖపట్నం, పాడేరు కేంద్రాలుగా మరో రెండు కలిపి మొత్తం నాలుగు రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాలు ఈ క్రమంలో పనిచేస్తాయి.
గంజాయి, మాదకద్రవ్యాల సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, విక్రయం, కొనుగోలు, నిల్వ, వినియోగం సహా సమూల నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ పని చేయనుంది. అమరావతిలో ఏర్పాటుచేసే నార్కోటిక్స్ పోలీసుస్టేషన్‌కు రాష్ట్ర మంతటా పరిధి కల్పించారు. ఇక్కడి సిబ్బంది రాష్ట్రంలో ఎక్కడైనా సరే గంజాయి, డ్రగ్స్ సంబంధిత కేసుల నమోదు, దర్యాప్తు చేయొచ్చు. డీఎస్పీ స్థాయి అధికారి ఈ స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వోగా వ్యవహరిస్తారు. ఈ కేసుల్లో విచారణ వేగంగా పూర్తిచేయించి, నిందితులకు శిక్షలు పడేలా చూసేందుకు విశాఖపట్నం, రాజమండ్రి , విజయవాడ, గుంటూరు, తిరుపతిల్లో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. డ్రగ్స్, గంజాయి ముఠాలపై సమాచారం ఇచ్చేందుకు, ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ - 1972ను ఏర్పాటు చేశారు. అమరావతి ప్రధాన కేంద్రంలోని కాల్‌సెంటర్ ఏర్పాటు చేశారు. ఇది 24 గంటలూ పనిచేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఈగల్, నార్కోటిక్స్ పోలీసుస్టేషన్, జిల్లా నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాల్లో కలిపి మొత్తం 459 మంది సిబ్బంది పని చేయనున్నారు. ప్రధాన కార్యాలయానికి 249, నార్కోటిక్స్ స్టేషన్‌కు 66, జిల్లా విభాగాలకు 144 పోస్టులు కేటాయించారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాల నుంచి వీరిని డిప్యూటేషన్‌పై తీసుకొని, ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఈ విభాగంలో పనిచేసే వారికి అదనంగా 30 శాతం అలవెన్స్ ఇవ్వనున్నారు.
సోషల్ మీడియా పర్యవేక్షణ, అనుమానాస్పద లావాదేవీల గుర్తింపు, డ్రగ్స్ రవాణా, నెట్‌వర్క్, ఆన్‌లైన్ ద్వారా జరిగే విక్రయాలను గుర్తించి అడ్డుకోవడం, డార్క్‌వెబ్‌పై నిఘా వంటి చర్యలతో పాటు వివిధ విభాగాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తారు. స్మగ్లర్ల ప్రొఫైలింగ్, వారి ఆర్థిక మూలాల విశ్లేషణ ద్వారా డ్రగ్స్‌ను సమూలంగా నిర్మూలించడంపై ఈగల్ పని చేయనుంది. స్మగ్లర్లు, కొరియర్ల నుంచి స్వాధీనం చేసుకునే సెల్‌ఫోన్లు, ఇతర పరికరాలను డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా విశ్లేషించి పాత్రదారులను పట్టుకోనుంది. మారుమూల ప్రాంతాల్లో జరిగే గంజాయి సాగు ప్రాంతాల్ని డ్రోన్లు, శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించి, ధ్వంసం చేస్తుంది.
ఇదీ చదవండి: Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..
ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter