Disha Bills: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రవేశపెట్టిన దిశ బిల్లులు త్వరలో హోం మంత్విత్వశాఖ ఆమోదం పొందనున్నాయి. మరోవైపు రాష్ట్రంలో దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళలపై అత్యాచారాలు అరికట్టేందుకు, మహిళల భద్రతకు ఏపీ ప్రభుత్వం(Ap government) దిశ బిల్లులు తీసుకొచ్చింది. ఈ బిల్లులను ఆమోదం కోసం కేంద్ర హోంశాఖకు పంపించారు. ఏపీ ప్రభుత్వం పంపించిన రెండు దిశ బిల్లులను(Disha Bills) పరిశీలన అనంతరం తమ అభిప్రాయాల్ని జోడించి తదుపరి ఆమోదం కోసం హోం మంత్రిత్వశాఖకు పంపించినట్టు కేంద్ర మహిళాభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. రాజ్యసభలో వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి (Vijayasai reddy)అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఏపీ ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు-క్రిమినల్ లా బిల్లు, మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాల విచారణకై ప్రత్యేక కోర్టుల ఏర్పాటు కోరుతూ రూపొందించిన బిల్లులపై హోం మంత్రిత్వశాఖ అభిప్రాయాలు కోరినట్టు చెప్పారు. 


మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దిశ కేంద్రాల(Disha Centres) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మహిళల కోసం 14 దిశ కేంద్రాల్ని ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం(Central government) ఆమోదం తెలిపింది. హింసకు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు పోలీసు రక్షణ, వైద్య, న్యాయ సహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్ సేవలతోపాటు ఆశ్రయం కల్పించేందుకు దిశ కేంద్రాల్ని తీర్దిదిద్దినట్టు మంత్రి తెలిపారు. ఆపదలో ఉన్న మహిళలకు దిశ కేంద్రాల్లో రాత్రిపగలు సేవలు అందుతున్నాయన్నారు. 


Also read: KGF Chapter 2: కేజీఎఫ్ ఛాప్టర్ 2 లో సంజయ్ దత్ న్యూలుక్ విడుదల


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook