AP grama sachivalayam exam key released: అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ (AP) గ్రామ, వార్డు  సచివాయ పరీక్ష ప్రాథమిక కీని ఏపీపీఎస్సీ (APPSC) విడుదల చేసింది. సెప్టెంబరు నెలలో నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్ష కీపై ఏమైనా అభ్యంతరాలుంటే.. ఈ నెల 3లోగా చెప్పాలని అభ్యర్థులకు సూచించింది. రాష్ట్రంలోని గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల భర్తీకి (grama/ward sachivalayam posts) సంబంధించిన పరీక్షలు (Exams) సెప్టెంబరు 20 నుంచి 26 వరకు జరిగాయి. పరీక్ష పూర్తివగానే ఆన్సర్‌ కీని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలు తలెత్తడంతో దాన్ని వెనక్కి తీసుకుంటున్నామని.. సెప్టెంబరు 29న ప్రకటించి.. మళ్లీ ప్రభుత్వం తాజాగా ఆన్సర్‌ కీని విడుదల చేసింది. అయితే అభ్యర్థులు ఆన్సర్‌ కీని అధికారిక వెబ్‌సైట్‌ http://gramasachivalayam.ap.gov.in లో చూసుకోవచ్చని తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌ (AP) గ్రామ, వార్డు  సచివాయ పరీక్ష ప్రాథమిక కీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి:  http://gramasachivalayam.ap.gov.in


ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో మొదటి విడత ఉద్యోగాల భర్తీ గతేడాదే పూర్తి చేసింది ప్రభుత్వం. ఆతర్వాత ఖాళీగా ఉన్న 16,208 ఉద్యోగాలకు జనవరిలో నోటిఫికేషన్‌ను విడుదల చేసి.. ఆగస్టులోగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. కరోనా కారణంగా గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను రెండు మూడు సార్లు వాయిదా వేసింది. ఆ తర్వాత సెప్టెంబరులో పరీక్షలను నిర్వహించింది. అయితే ఈ పరీక్ష ఫలితాలు విడుదలైన అనంతరం ప్రభుత్వం ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. Also read: K. Himanshu: సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు గాయాలు..!