ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ప్రతిపాదిత ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖ ( Executive capital Visakhapatnam ) అభివృద్ధికి బీజం పడుతోంది. ప్రతిష్ఠాత్మక మెట్రో రైల్ కార్పొరేషన్ ( Metro Rail corporation ) కార్యకలాపాలు విశాఖ నుంచి ప్రారంభం కావడం దీనికి నిదర్శనం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ( Ap Three Capitals ) దిశగా ముందుకు సాగుతోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించిన ప్రభుత్వం ( Ap Government ) ఆ దిశగా అభివృద్ధి పనులు ప్రారంభించనుంది. ఇప్పుడు విశాఖలో ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యకలాపాలను ( Ap metro rail corporation operations )  ప్రారంభించింది. నగరంలోని ఎల్ఐసీ భవన్ మూడో అంతస్థులో రీజనల్ కార్యాలయాన్ని మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ లు ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రజంటేషన్ ను అధికారులు మంత్రులకు వివరించారు.


విశాఖలో మెట్రో కారిడార్ నిర్మాణానికి ప్రతిపాదన ఉంది. ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమవుతోంది. విశాఖపట్నంలో 79.91 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో కారిడార్ ( light metro corridor ) , 60.29 కిలోమీటర్ల మేర మోడ్రన్ ట్రామ్ కారిడార్ ను నిర్మించేందుక రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అందుకే స్థానికంగా కార్యాలయాన్ని ప్రారంభించారు. మరో రెండు నెలల్లో డీపీఆర్ ( DPR in Two months ) సిద్ధం చేసి సమర్పించాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. డీపీఆర్ లపై కన్సల్టెంట్లతో చర్చలు, ఇతరత్రా అంశాలపై చర్చించే ఉద్దేశ్యంతో ..పాలనా సౌలభ్యం కోసం ఈ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసినట్టు మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. 


వాస్తవానికి ముందుగా గాజువాక నుంచి కొమ్మాది వరకూ  మెట్రో రైలు ఉండాలనుకున్నామని..అయితే రానున్న అవసరాల దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనల మేరకు పరిధిని పెంచామని మంత్రి బొత్స తెలిపారు. మెట్రో రైలును స్టీల్‌ ప్లాంట్‌ నుంచి భోగాపురం విమానాశ్రయం ( metro rail from Steel plant to Bhogapuram ) వరకూ పెంచి.. డీపీఆర్‌ తయారు చేస్తున్నామన్నారు. డీపీఆర్ సిద్ధం చేసే బాధ్యతను యూఎంటీసీ  సంస్థకు అప్పగించారు. నవంబర్‌ మొదటి వారంలో డీపీఆర్‌ సిద్ధం కానుంది. 


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంచి ఆలోచన, విజన్‌తో విశాఖకు మెట్రో కేటాయించారని... విశాఖకు మెట్రో రైల్ వస్తే ఉత్తరాంధ్ర రూపు రేఖలే మారిపోతాయని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. లైట్‌ మెట్రోతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని.. ట్రాఫిక్‌ పెరిగే కొద్దీ కోచ్‌ల సంఖ్య పెంచుకోవచ్చని మెట్రో కార్పొరేషన్ వెల్లడించింది. Also read: YS Jagan Dussehra Wishes: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా: వైఎస్ జగన్