ఏపీలో ఏం జరుగుతోంది..ఆలయాల్లో విగ్రహ ధ్వంస ఘటనలు..ఎందుకు చేస్తున్నారు..ఎవరు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర కోణం దాగుందా..పోలీసులైతే అదే అంటున్నారు మరి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh )లో ఇటీవలి కాలంలో చిన్న చిన్న ఆలయాల్ని టార్గెట్ ( Attacks on Temples ) చేసుకుని విగ్రహ ధ్వంస ఘటనలు జరుగుతున్నాయి. అంతర్వేది రధం దగ్దం ( Antarvedi chariot burn ) నుంచి ప్రారంభమై అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. తాాజాగా విజయనగరం జిల్లా రామతీర్ధం ( Ramatheertham ) లో రాముడి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ధ్వంసమైన వెంటనే ప్రతిపక్షం దీనిపై ఆరోపణలు ప్రారంభించింది. 


వాస్తవానికి విజయనగరం జిల్లాలో డిసెంబర్ 30వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) పర్యటనకు ముందు..అదే నెల 29వ తేదీ ఆలయంలో సీసీ కెమేరా ఏర్పాటు చేస్తారన్న నేపధ్యంలో 28 వ తేదీ రాత్రి రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనుమానాలకు తావిస్తోంది. 


Also read: Uk Flight services: లండన్‌కు వారానికి 30 విమాన సర్వీసులు


మరోవైపు అదే సమయంలో కర్నూలు జిల్లా కోసిగి మండలం సజ్జలగూడెం పొల్లాల్లో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంపై ఉన్న విగ్రహం ధ్వంసం జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. వెంటనే అప్రమత్తమైన కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప..సంఘటనా ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా అసలక్కడ విగ్రహ ధ్వంసమే జరగలేదని నిర్ధారణైంది. దీంతో తప్పుడు ప్రచారాలతో భక్తుల మనోభావాల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే శిక్ష తప్పదని ఎస్పీ హెచ్చరించిన పరిస్థితి ఉంది.


జరిగిన ప్రచారం..వాస్తవం 


ఈ రెండు ఘటనలతో పాటు సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ఫ్రచారం నేపధ్యంలో కుట్రకోణం దాగుందనేది పోలీసులు అనుమానం. అదే దిశగా దర్యాప్తు ప్రారంభమైంది. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి..ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుందా అనేది సర్వత్రా విన్పిస్తున్న మాట. 


Also read: Indian vaccine: తొలి దేశీయ వ్యాక్సిన్‌కు ఆమోదం..త్వరలో పంపిణీ ప్రారంభం


రామతీర్ధం ఘటన (* Ramatheertham incident ) నేపధ్యంలో ఇటీవలి కాలంలో దేవాలయాల విషయంలో జరిగిన తప్పుడు ప్రచారాల్ని డీజీపీ ( DGP ) కార్యాలయం ప్రకటించింది. కృష్ణా జిల్లా గుడివాడ గుడి హుండీ చోరీకు మతం రంగు పులిమే ప్రయత్నం చేశారు. వాస్తవమేంటంటే మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులు డబ్బుల కోసం హుండీ పగలగొట్టారని దర్యాప్తులో తేలింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కాలభైరవ ఆలయంలో విగ్రహాల చోరీ అంటూ ప్రచారం సాగింది. కానీ రాజశేఖర్ అనే వ్యక్తి సంతానం కోసం విగ్రహం చోరీ చేసినట్టు స్పష్టమైంది.


మరోవైపు శ్రీకాకుళం జిల్లా ( Srikakulam District ) ఎచ్చెర్ల సరస్వతీ దేవి విగ్రహ విధ్వంసం జరిగిందని..అన్యమతాలవారు చేశారంటూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. వాస్తవానికి అసలా విగ్రహాన్ని ఎవరూ ధ్వంసమే చేయలేదని తేలింది. ఇలాంటి సంఘటనలన్నీ కుట్రకోణాన్ని బహిర్గతం చేస్తున్నాయని పోలీసులు అంటున్నారు. 


Also read: AP: రామతీర్ధం ఘటనపై రాజుకుంటున్న వేడి..చంద్రబాబు హస్తముందంటున్న మంత్రి వెల్లంపల్లి