AP: రామతీర్ధం ఘటనపై రాజుకుంటున్న వేడి..చంద్రబాబు హస్తముందంటున్న మంత్రి వెల్లంపల్లి

రామతీర్ధం ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమౌతోంది. రామతీర్ఘం ఘటనలో ప్రతిపక్షనేత చంద్రబాబు హస్తముందంటూ ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించడం సంచలనంగా మారింది.

Last Updated : Jan 2, 2021, 10:37 PM IST
  • రామతీర్ధం ఘటనపై రాజుకుంటున్న వేడి..
  • అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమౌతున్న మాటల యుద్ధం
  • ప్రతిపక్షనేత చంద్రబాబు హస్తముందని ఆరోపించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
AP: రామతీర్ధం ఘటనపై రాజుకుంటున్న వేడి..చంద్రబాబు హస్తముందంటున్న మంత్రి వెల్లంపల్లి

రామతీర్ధం ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమౌతోంది. రామతీర్ఘం ఘటనలో ప్రతిపక్షనేత చంద్రబాబు హస్తముందంటూ ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించడం సంచలనంగా మారింది.

విజయనగరం జిల్లా రామతీర్ధం ( Ramatheertham ) బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలోని శ్రీరాముని విగ్రహం శిరస్సును డిసెంబర్ 28వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు తొలగించి..సీతమ్మ కొలనులో పాడేశారు. స్థానికంగా కలకలం రేపిన రామతీర్ధం ఆలయ ( Ramtheertham temple ) ఘటనపై రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ( Chandrababu ) అధికారపార్టీని టార్గెట్ చేయడంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ప్రతిపక్ష నేతల ఆరోపణల్ని అధికారపార్టీ నేతలు, మంత్రులు తిప్పికొడుతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరో అడుగు ముందేశారు.

Also read: Adityanath Das: ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు

మొత్తం ఘటన వెనుక చంద్రబాబు హస్తముందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ( Minister vellampalli srinivas ) ఆరోపించారు. చంద్రబాబుకు దేవుడి పట్ల భయం, భక్తి లేదని మంత్రి విమర్శించారు. దేవాలయాలపై దాడులు చేయించిన దుర్మార్గుడు చంద్రబాబు అని వెల్లంపల్లి శ్రీనివాస్ దుయ్యబట్టారు. బుట్లు వేసుకుని పూజలు చేసిన వ్యక్తి..కులమతాల చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడన్నారు. తిరుపతిలో వేయి కాళ్ల మండపాన్ని కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. 

రామతీర్ధం ఆలయ కమిటీ ఛైర్మన్ , టీడీపీ ( Tdp ) నేత అశోక్ గజపతిరాజు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. దేవుని ఆస్థుల్ని చంద్రబాబు బినామీలకు కట్టబెట్టారని..అతని పాపాలకు శిక్ష పడే రోజు తొందరలోనే ఉందన్నారు. అటు  శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ ఘటనపై స్పందించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో మాట్లాడారు. అసాంఘిక శక్తుల్ని నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ( Ap government ) ప్రతిష్ట, హిందూవుల మనోభావాల్ని దెబ్బతీసే కుట్రల్ని నిరోధించాలని చెప్పారు. ఆలయాల భద్రతపై దిగువ స్థాయి ఉద్యోగుల్ని అప్రమత్తం చేయాలన్నారు. దేవాలయాలపై దాడుల్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందనే సంకేతాల్ని పంపాలని సూచించారు. 

Also read: AP: అత్యవసర వాహనాల్ని ప్రారంభించిన సీఎం జగన్

Trending News