AP Heavy Rains: ఏపీలో వేసవి కాలం వర్షాలతో ప్రారంభం కానుంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండం కావడంతో..రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. శ్రీలంకలోని ట్రింకోమలికు నార్త్ ఈస్ట్ 340 కిలోమీటర్లు, తమిళనాడులోని నాగపట్నానికి తూర్పుదిశగా 3 వందల కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 3 వందల కిలోమీటర్లు, చెన్నైకు ఆగ్నేయంగా 3 వందల కిలోమీటర్ల దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ..సాయంత్రానికి తమిళనాడు తీరానికి చేరువ కానుంది. 


ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాంధ్రలో రానున్న 48 గంటలు వాతావరణంలో ఏ మార్పు ఉండదు. దక్షిణ కోస్తాంధ్రలో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. అటు రాయలసీమలో వర్షాలు పడనున్నాయి. తమిళనాడులో మాత్రం భారీ వర్షాలు తప్పవు. ఇటు తమిళనాడు, అటు కోస్తాంధ్ర తీరంలో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచిస్తోంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. 


Also : Nimmala Rama Naidu: సైకిల్‌ యాత్ర చేస్తూ.. ప్రమాదవశాత్తు జారిపడిన టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook