AP 10th Board Exams from June 7 to June 16, 2021: ఏపీలో జూన్‌ నెల 7వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 16వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ బుధవారం నాడు ఏపీ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్(AP SSC Exams Time Table 2021) విడుదల చేశారు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది విద్యార్థులకు పూర్తి స్థాయిలో క్లాసులు నిర్వహించలేకపోయామని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


పదో తరగతి విద్యార్థులకు 220 రోజుల పాటు తరగతులు నిర్వహించాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా కేవలం 167 రోజులే నిర్వహించామని చెప్పారు. అందువల్ల 35శాతం సిలబస్ తగ్గించి ఏపీ 10వ తరగతి పరీక్షలు(AP SSC Exams Time Table 2021) నిర్వహించనున్నట్లు తెలిపారు. అయితే రెగ్యూలర్ విధానానికి భిన్నంగా కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది కేవలం ఏడు పేపర్లు మాత్రమే ఉంటాయన్నారు. 


Also Read: AP SSC Time Table 2021: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల, AP 10th Time Table 2021 కోసం క్లిక్ చేయండి


 


గతానికి భిన్నంగా ఈ ఏడాది విద్యార్థులకు జూలై 1 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్(Adimulapu Suresh)‌ స్పష్టం చేశారు. కరోనాతో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని, వచ్చే ఏడాది అలా జరగకుండా చూస్తామన్నారు. ఈ క్రమంలోనే వేసవి సెలవులు రద్దు చేశామన్నారు. కేవలం ఒంటిపూట బడులకు ఏపీ ప్రభుత్వం నిర్నయం తీసుకోనుందని పేర్కొన్నారు.


Also Read: AP Panchayat Elections ఫిర్యాదుల కోసం E-Netram App ఆవిష్కరించిన వైఎస్సార్‌సీపీ


 


కాగా, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 24 వరకు రెండు సెషన్లుగా జంబ్లింగ్‌ విధానంలో ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తారని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. 


Also Read: Ujjwala Yojana: Free LPG కనెక్షన్, రూ.1600 రావాలంటే PMUY వివరాలు తెలుసుకోండి


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook