AP Assembly Speaker Fake Degree Issue: ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం రాజుకుంటోంది. మహాత్మా గాంధీ లా కళాశాల, హైదరాబాద్ నుంచి మూడేళ్ల ఎల్ఎల్‌బి పాస్ అవడంపై తెలుగుదేశం పార్టీ వివాదం రాజేస్తోంది. లా పరీక్షలు రాశారా లేదా రాయకుండానే లా పట్టా సాధించారా అనేది ఓ వివాదమైతే..అసలు డిగ్రీనే లేకుండా ఎల్ఎల్‌బీ అడ్మిషన్ ఎలా జరిగిందని ప్రశ్నిస్తూ టీడీపీ నేత కూన రవికుమార్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ఆ లేఖ ప్రకారం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ నేత కూన రవికుమార్ లేఖలో..


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం 2019-20లో హైదరాబాద్ ఎల్‌బి నగర్‌లోని మహాత్మా గాంధీ లా కళాశాలలో మొదటి సంవత్సరం ఎల్‌ఎల్‌బీలో ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ ఆధారంగా అడ్మిషన్ పొందారు. మూడేళ్ల లా కోర్సు చేయాలంటే సంబంధిత అభ్యర్ధి డిగ్రీ లేదా సమానమైన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుండాలి. కానీ తమ్మినేని సీతారాంకు డిగ్రీ చేయలేదని, అతని విద్యార్ఙత ఇంటర్మీడియట్ మాత్రమేనని, శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ డిస్‌కంటిన్యూ చేసినట్టుగా స్వయంగా ఆయనే ఐడ్రీమ్ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో స్పష్టం చేసినట్టుగా లేఖలో కూన రవికుమార్ తెలిపారు. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు స్పీకర్ అయిన కారణంగా డిగ్రీ లేకపోయినా ఎల్ఎల్‌బి కోర్సులో అడ్మిషన్‌కు మినహాయింపు ఇచ్చారా అని రవి కుమార్ ప్రశ్నించారు. 2019-20లో ఎల్‌ఎల్‌బీ మొదటి సంవత్సరం పరీక్షల్ని హాల్ టికెట్ నెంబర్ 172419831298 తో రాశారని చెప్పారు. దీనికి సంబంధించి తమ్మినేని సీతారాం సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ కూడా రవికుమార్ సమర్పించారు. 


తమ్మినేని సీతారాం కేవలం ఆముదాలవలసకు ఎమ్మెల్యే మాత్రమే కాకుండా, 175 మంది ఎమ్మెల్యేలున్న ఏపీ అసెంబ్లీకు మార్గదర్శకుడిగా ఉండే వ్యక్తి అని..అంతటి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నకిలీ డిగ్రీలతో లా అడ్మిషన్ పొందడం సరైంది కాదని, ఇలాంటి పనుల్ని ఉపేక్షించకూడదని రవికుమార్ లేఖలో ప్రస్తావించారు. 


[[{"fid":"267322","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ap speaker tammineni fake degree issue","field_file_image_title_text[und][0][value]":"ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నకిడీ డిగ్రీ ఆరోపణలు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Ap speaker tammineni fake degree issue","field_file_image_title_text[und][0][value]":"ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నకిడీ డిగ్రీ ఆరోపణలు"}},"link_text":false,"attributes":{"alt":"Ap speaker tammineni fake degree issue","title":"ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నకిడీ డిగ్రీ ఆరోపణలు","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించి చర్యలు తీసుకోవాలి


ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీ నియమించి వెంటనే దర్యాప్తు చేయించాలని కోరారు. అంతేకాకుండా ఉస్మానియా యూనివర్శిటీ నుంచి అతని డిగ్రీ వివరాలు రప్పించి తగిన చర్యలు తీసుకోవాలని కూన రవికుమార్ కోరారు. ఈ వ్యవహారాన్ని సీఐడీ దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవడం ద్వారా చట్టం ముందు అందరూ సమానులేనన్న సందేశాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశారు. 


Also read: YCP Offer: జేడీ లక్ష్మీనారాయణకు వైసీపీ ఆఫర్..ఆ హామీ ఇస్తే ఓకే అంటున్న సీబీఐ మాజీ అధికారి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook