ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) కు మిగిలిన మూడున్నరేళ్ల సమయం పాలిస్తారా లేదా? రాజకీయ వర్గాల్లో ఇప్పుడీ ప్రశ్న హాట్ టాపిగా మారింది. ఏపీ బీజేపీ  ఉపాధ్యక్షుడు స్వయంగా ఈ మాటలనడమే దీనికి కారణం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా ప్రభుత్వంపై ఇబ్బంది ఎదురవుతోంది. ముఖ్యంగా అంతర్వేది ఆలయం ( Antarvedi temple ) లో రధం దగ్దమైన ( Chariot burnt ) ఘటన మొదలుకుని జరిగిన వరుస ఘటనలు ఓ వర్గంలో అభద్రతను రేపుతుందనేది భారతీయ జనతా పార్టీ ( Bharatiya janata party ) ఆరోపణ. ఈ ఘటనపై బీజేపీ నేతలు ( Bjp Leaders ) నేరుగానే విమర్శలు చేస్తున్నారు. హిందూవులు ఎక్కడ తలదాచుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ( Bjp Vishnu kumar raju ) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఇంకా మూడున్నరేళ్ల సమయముందని...అయితే పూర్తి కాలం పాలిస్తారన్న నమ్మకం లేదని చెప్పి సంచలనం సృష్టించారు. జగన్ ప్రభుత్వం మరో మూడున్నరేళ్లు ఉంటుందన్న నమ్మకం తమకు లేదంటున్నారు బీజేపీ నేతలు. ఇప్పుడీ వ్యాఖ్యలే సంచలనం కలుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. 


రాష్ట్రంలో నిరంకుశ పాలన జరుగుతోందని...బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ఇలాంటి పాలనను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. అయితే అధికారంలో ఉన్నంతకాలం మంచిగా ఉండాలంటూ సలహా ఇస్తున్నామన్నారు. ధర్మ పరిరక్షణ కోసం అంతర్వేది, అమలాపురం వెళ్లినవారిపై అక్రమ కేసులు పెట్టారని..తక్షణం వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనలు తరచూ కొనసాగుతుంటాయన్నారు. హిందూవుల మనోభావాల్ని ప్రబుత్వం దెబ్బతీస్తోందని..దేవాలయ ఆస్థులు, భూములు కొల్లగొట్టాలని చూస్తే పరాభవం తప్పదని చెప్పారు. 


మరోవైపు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ( Bjp mp Gvl narasimha rao ) సైతం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హిందూ ఆలయాలపై దాడులు జరిగితే ప్రభుత్వం సరైన విధంగా స్పందించడం లేదన్నారు. బీజేపీ నేతల అంతర్వేది కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుందని, బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి అణచివేత చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఆంధ్రాలో హిందూవులు ఎక్కడ శరణు కోరాలని సైతం ఆయన ప్రశ్నించారు. 


ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు ఇంత ఘాటుగా , నేరుగా ప్రభుత్వాన్ని విమర్శించడం ఇదే తొలిసారి. అందుకే బీజేపీ నేతల వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. Also read: AP Judiciary: హైకోర్టుకు..ప్రభుత్వానికి మధ్య పెరుగుతున్న అంతరం, ఎంపీల విమర్శలు