AP: మూడు నెలల విద్యుత్ ఛార్జీలు రద్దు..వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు
AP: కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్గించింది. మూడు నెలల పాటు విద్యుత్ ఛార్జీల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై సినీ పరిశ్రమ కృతజ్ఞతలు తెలుపుతోంది.
AP: కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్గించింది. మూడు నెలల పాటు విద్యుత్ ఛార్జీల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై సినీ పరిశ్రమ కృతజ్ఞతలు తెలుపుతోంది.
ఏపీ ( AP ) లో త్వరలో ధియేటర్లు ( Theatres ) తెర్చుకోనున్నాయి. 3 నెలల పాటు ధియేటర్లు చెల్లించాల్సిన నిర్ణీత విద్యుత్ ఛార్జీల్ని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం ( Ap Cabinet Decision ) తీసుకోవడంతో ధియేటర్ యాజమాన్యాల ప్రధాన సమస్య తీరినట్టైంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టీఫ్లెక్స్, ధియేటర్ల విద్యుత్ ఛార్జీలు రద్దు కానున్నాయి. ఇందులో బాగంగా నెలకు 3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
మూడు నెలల విద్యుత్ ఛార్జీలు ( Electricity charges ) రద్దు చేయడమే కాకుండా మిగిలిన ఆరు నెలల నిర్ధారిత విద్యుత్ ఛార్జీల చెల్లింపుల్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రభుత్వం ( Ap government ) తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 11 వందల థియేటర్లకు లబ్ది చేకూరనుంది. విద్యుత్ ఛార్జీల రద్దు వంటి కీలక నిర్ణయాల పట్ల సినీ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ( Ap cm ys jagan ) కృతజ్ఞతలు తెలిపింది. సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన సహాయం ఎనలేనిదని నిర్మాత ఎల్వీ ప్రసాద్ కొనియాడారు. అటు దిల్ రాజు సైతం ముఖ్యమంత్రి జగన్‌కు దన్యవాదాలు తెలిపారు. చిత్ర పరిశ్రమ కోసం రీస్టార్ట్ ప్యాకేజ్ ప్రకటించిన వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది.
Also read: AP Cabinet Meeting Key Decisions: ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలు ఇవే..