సుదీర్ఘంగా సాగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమాావేశం ( Ap Cabinet meeting ) ముగిసింది. కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మచిలీపట్నం పోర్టు డీపీఆర్ కు అనుమతిచ్చింది. నూతన ఇసుక పాలసీను ప్రవేశపెట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ ( Ap cm ys jagan ) నేతృత్వంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం కాస్సేపటి క్రితం ముగిసింది. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా మచిలీపట్నం పోర్టుకు సంబంధించిన డీపీఆర్ కు ఏపీ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 5 వేల 835 కోట్లతో 36 నెలల వ్యవధిలో పోర్టు నిర్మించనున్నారు. మరోవైపు చిరు వ్యాపారులకు లబ్ది చేకూర్చే జగనన్న చేదోడు ( jagananna Chedodu Scheme ) పథకానికి ఆమోదం తెలిపింది. 


మరోవైపు రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రాజెక్టు, కొత్త ఇసుక పాలసీని ( New Sand policy ) ఆమోదిస్తూ ప్రభుత్వం ( Ap government ) నిర్ణయం తీసుకుంది. విజయనగరం జిల్లా గాజులరేగలో.. కొత్త మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాలు, పాడేరు మెడికల్ కాలేజీకి 35 ఎకరాల భూమి కేటాయింపుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. Also read: AP LAWCET 2020 Results: ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల


ఏపీ ( Ap ) లో కొత్త ఇసుక విధానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇసుక తవ్వకాలకు ప్రభుత్వ సంస్థలకే తొలి ప్రాధాన్యత ఉండనుంది. ఒకవేళ ప్రభుత్వ సంస్థలు ముందుకు రానిపక్షంలో టెండర్లు పిలవనున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా ఇసుక బుకింగ్, సొంతవాహనంలో వినియోగదారులు ఇసుకను తీసుకెళ్లే సౌకర్యం కల్పించారు. ప్రభుత్వ ధరల కంటే అదిక రేట్లకు ఇసుక అమ్మితే కఠిన చర్యలు ఉండనున్నాయి. ఇసుక ధరలపై సమస్యలు తలెత్తితే  ప్రజలు ఎస్ఈబీకు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. 


ఇందులో భాగంగా ఎస్ఈసీ ( SEC ) ను మరింతగా బలోపేతం చేయనుంది ప్రభుత్వం. ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్ఈబీకు అనుసంధనంగా పనిచేస్తుంది. ఎస్ఈబీ పరిధిలోకే గుట్కా, జూదం, మత్తు పదార్ధాలు రానున్నాయి. నవంబర్ 24 నుంచి  జగనన్న చేదోడు పథకం ప్రారంభం కానుంది. ఇంటింటికీ రేషన్ బియ్యం జనవరి 1 నుంచి అమలు కానుంది.  అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతి బియ్యం బస్తాపై క్యూఆర్ కోడ్, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది. పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేస్తూ..మహిళా పాల ఉత్పత్తి సంఘాల ద్వారా పాల సేకరణకు శ్రీకారం చుట్టనున్నారు. Also read: AP: అమరావతి భూముల కుంభకోణం కేసులో కీలక పరిణామం