AP: అమరావతి భూముల కుంభకోణం కేసులో కీలక పరిణామం

అమరావతి భూముల కుంభకోణం కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. కేసు విచారణలో భాగంగా టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేసిన కోర్టు..నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

Last Updated : Nov 5, 2020, 03:51 PM IST
AP: అమరావతి భూముల కుంభకోణం కేసులో కీలక పరిణామం

అమరావతి భూముల కుంభకోణం ( Amaravati lands scam ) కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. కేసు విచారణలో భాగంగా టీడీపీ ( TDP ) నేతలకు నోటీసులు జారీ చేసిన కోర్టు..నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

ఏపీ ( AP ) రాజధాని ప్రాంతం అమరావతి భూముల కొనుగోలు వ్యవహారంలో కుంభకోణం జరిగిందని ఏపీ ప్రభుత్వం ( Ap Government ) నిర్ధారించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ ( Insider trading )  ఆధారంగా రాజధాని ప్రాంతంపై ముందే సమాచారాన్ని తీసుకుని..ఆ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ( SIT )ఏర్పాటు చేయడమే కాకుండా సీఐడీ ( CID Probe ) విచారణ చేపట్టింది. 

అయితే సీఐడీ దర్యాప్తు, సిట్ ఏర్పాటును ప్రశ్నిస్తూ..ప్రతివాదులు ఏపీ హైకోర్టు ( Ap High court ) ను ఆశ్రయించి..స్టే తెచ్చుకున్నారు. ఈ స్టేను  ఎత్తివేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టు ( Supreme court ) లో పిటీషన్ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు దశలో ఉన్నప్పుడు హైకోర్టు స్టే విధించడం సరైంది కాదని..ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు విన్పించారు. Also read: AP LAWCET 2020 Results: ఏపీ లాసెట్‌ ఫలితాలు విడుదల

కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా సిట్ ఏర్పాటైందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది ప్రభుత్వం. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశాలు లేవని వివరించారు. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసినట్టు గుర్తుచేశారు.

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు..గత టీడీపీ ప్రభుత్వ ( Tdp Government ) నిర్ణయాలన్నింటిపై విచారిస్తారా అని ప్రశ్నించింది. ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశ్యాల్లేవని..అక్రమాలు జరిగిందనే విషయాలపైనే సిట్ దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేశారు. సిట్ దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం కూడదని వాదించింది ప్రభుత్వం. ఆర్టికల్ 226 ప్రకారం సిట్ దర్యాప్తుపై హైకోర్టులో పిటీషన్లు వేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాస్తవానికి వ్యక్తిగతంగా ప్రభావితం కానప్పుడు..ఆర్టికల్ 226 ప్రకారం రిట్ దాఖలు చేయలేరన్నారు. హైకోర్టుకు అసాధారణ అధికారాల్లేవని..సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ఉండాల్సిందేనన్నారు. 

ప్రభుత్వ వాదనలు విన్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం..నాలుగు వారాలకు కేసును వాయిదా వేసింది. అప్పుడే ఈ కేసులో తుది వాదనలు వింటామని స్పష్టం చేసింది. మరోవైపు టీడీపీ నేత వర్ల రామయ్య సహా ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. Also read: Visakha Fire Accident: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Trending News