ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు.  ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీలం సాహ్ని ఈ మేరకు ఎన్నికల కమీషన్ కు లేఖ రాశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ( Ap local Body Elections )పై ప్రభుత్వం తన వైఖరిని ప్రకటించింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్రంలో పరిస్థితులు అనువుగా లేవని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీలం సాహ్ని ( Ap chief secretary Neelam Sahni ) రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( State Election Commissioner Nimmagadda Ramesh kumar ) కు లేఖ ద్వారా తెలిపారు. అధికార యంత్రాంగమంతా కోవిడ్ విధుల్లో ఉన్నందున ఎన్నికల నిర్వహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిన  అవసరం ప్రస్తుతం లేదని నీలం సాహ్ని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని..ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించిందని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో ఎన్నికలు నిర్వహించాలనడం ప్రజాహితం కాదన్నారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంతో ఒక్కో రాష్ట్రం ఒక్కో వ్యూహాన్ని అమలు చేస్తోందని..ఓ రాష్ట్రాన్ని మరో రాష్ట్రంతో పోల్చడం సరైంది కాదన్నారు. 


రాష్ట్రంలో ఇప్పటికే 6 వేల 890 మంది కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా మరణించారని..రానున్న రోజుల్లో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్రం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల కమీషన్ తన నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనప్పుడు ఎన్నికల చర్యలు ప్రారంభిస్తే మంచిదని నీలం సాహ్ని తెలిపారు. రాష్ట్రంలో గ్రామ పంచాయితీ ఎన్నికల్ని ఫిబ్రవరి నెలలో నిర్వహించాలని నిర్ణయించినట్టుగా ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రొసీడింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సమాధానంగానే నీలం సాహ్ని ఈ లేఖ రాశారు. Also read: AP: తుంగభద్ర పుష్కరాలకు వైఎస్ జగన్, పర్యటన వివరాలివీ..


.