Pension Kanuka Hike: పెరిగిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక- ఇకపై రూ.2,500
YSR Pension Kanuka Hike: ఏపీలో పెన్షన్‌దారులకు ప్రభుత్వం గుడ్ న్యుస్ చెప్పింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక మొత్తం పెంపును అమలు చేసింది. సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
YSR Pension Kanuka Hike: వైఎస్ఆర్ పెన్షన్ల కానుక పెంపును ప్రారంభించారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు (YSR Pension Kanuka Increased) సీఎం.
దీనితో వృద్ధులు, వితంతువులకు పెన్షన్ రూ.2,250 నుంచి రూ.2,500కు పెరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం లబ్దిదారుల్లో కొంత మందికి నేరుగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకను అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. కొత్త సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉందని వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీని నిలబెట్టుకున్నట్లు తెలిపారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం పెన్షన్ పెంపు పథకంపైనే చేసినట్లు గుర్తు (CM Jagan on YSR Pension Kanuka) చేశారు.
పెరిగిన లబ్ధిదారులు..
ఈ నెల నుంతి కొత్తగా 1.51 లక్షల మంది కొత్తగా పెన్షన్ పరిధిలోకి వచ్చినట్లు ఏపీ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజులపాటు ఈ కార్యక్రమం జరగనున్నట్లు వెల్లడించారు మంత్రి రామచంద్రా రెడ్డి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులంతా.. ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు.
మరిన్ని..
పెన్షన్ కోసం రూ.1,570.60 కోట్లను ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం.
దీర్ఘకాలిక వ్యాధులు, గుర్తించిన ఆనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కూడా మెడికల్ పెన్షన్లను అందిస్తోంది ప్రభుత్వం. లబ్ధిదారులకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ఈ విధమైన పెన్షన్లు ఇస్తోందని ఇటీవల ప్రభుత్వం వెల్లడించింది.
Also read: Ap Cm Ys Jagan: పథకాల్ని అడ్డుకునేవారంతా నిరుపేదల శత్రువులే : వైఎస్ జగన్
Also read: Jahnavi Dangeti: ఆంధ్ర అమ్మాయి జాహ్నవి రికార్డ్.. నాసా ట్రైనింగ్‌లో పాల్గొన్న మొదటి భారతీయురాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook