Ap Cm Ys Jagan: పథకాల్ని అడ్డుకునేవారంతా నిరుపేదల శత్రువులే : వైఎస్ జగన్

Ap Cm Ys Jagan: సినిమా టికెట్ల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజేశాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు అధికమౌతూ..వివాదం రాజుకుంటున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 1, 2022, 02:50 PM IST
Ap Cm Ys Jagan: పథకాల్ని అడ్డుకునేవారంతా నిరుపేదల శత్రువులే : వైఎస్ జగన్

Ap Cm Ys Jagan: సినిమా టికెట్ల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజేశాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు అధికమౌతూ..వివాదం రాజుకుంటున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా..ఏ నోట విన్నా సినిమా టికెట్ల వ్యవహారమే కన్పిస్తోంది. ఈ విషయంపై పెద్ద రచ్చే రేగుతోంది. సినీ ప్రముఖుల్నించి వివిధ రాజకీయ పార్టీలు, నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, డిస్ట్రిబ్యూటర్లు ఒకరికపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎక్కడ విన్నా ఇదే టాపిక్ హల్‌చల్ చేస్తోంది. సినిమా టికెట్ల సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం ఓ కమిటీ కూడా నియమించింది. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంపై జగన్ స్పందించారు. 

గుంటూరు జిల్లాలో వైఎస్సార్ పెన్షన్ కానుక (Ysr Pension Kanuka)పెంపు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్..సినిమా టికెట్ల వ్యవహారంపై మాట్లాడారు. ప్రభుత్వం చేసే ప్రతి పనినీ అడ్డుకుంటున్నారంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. కోర్టుల్లో కేసులు వేస్తూ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పేదవారికి వినోదం అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో సినిమా టికెట్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే..దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓటీఎస్ పథకంపై కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారన్నారు. ఇటువంటివారు పేదలకు శత్రువులని..ఎన్ని అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేసినా అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో వృధ్యాప్య పెన్షన్‌ను 2 వేల 250 రూపాయల్నించి 2 వేల 5 వందలకు పెంచామని వైఎస్ జగన్ (Ap cm ys jagan) తెలిపారు. ఎవరైనా సరే మంచి పాలన కోసం ఆరాటపడతారని..అభివృద్ధి బాటలో నడిపిస్తుంటే అభినందిస్తారని.కానీ వీళ్లు మాత్రం అడ్డంకులు పెడుతున్నారని జగన్ చెప్పారు. విమర్శలు చేసేవారికి నిరుపేదల కష్టాలు తెలుసా అని ప్రశ్నించారు. ఆర్ధికంగా ఆధారం లేక అల్లాడుతున్న వృత్తులు చాలానే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ల కోసం  4 వందల కోట్లు ఖర్చు పెడితే..తమ ప్రభుత్వం 1450 కోట్లు ఖర్చుపెడుతోందన్నారు. కోవిడ్ సమయంలో సైతం ప్రతి సంక్షేమ ఫథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. 

Also readPension Kanuka Hike: జనవరి 1 నుంచే పెన్షన్​ కానుక పెంపు అమలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News