Eluru Mysterious Disease:ఏలూరు సిటీలో గత కొంత కాలంగా వింత వ్యాధి వల్ల సుమారు 340 మంది ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. చాలా మంది స్పృహ కోల్పోవడం, మూర్చపోవడం, నోటి నుంచి నురగకక్కుకుంటూ పడిపోవడం కనిపిస్తోంది. ఇవాళ అసుపత్రిని సందర్శించిన ఏపి ముఖ్యమంత్రి జగన్.. బాధితులను పరామర్శించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వ్యాధికి కారణం ఏంటో వైద్యులకు కూడా తెలియపోవడంతో జగన్ (CM Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యాధిపై అంతర్జాతీయ సంస్థలతో అధ్యయనం చేయించాలి అని నిర్ణయించారు.



Also Read : Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి


తాజా సమాచారం మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయం తీసుకోవాలని జగన్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. దీంతో త్వరలో WHO టీమ్ ఏలూరుకు చేరుకునే అవకాశం ఉంది. అయితే ఈ వ్యాధిపై దేశ వ్యాప్తంగా సంచలనం ఏర్పడటంతో ఇప్పటికే  సీసీఎంబీ, ఐఐసీటీ, ఎన్ఐఎన్ సంస్థలు ఈ వ్యాధికి కారణం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.



Also Read | Cough and Cold: జలుబు, దగ్గు వల్ల ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి


వీటితో పాటు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి అని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే 180 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు అని సమాచారం.బాధితుల్లో కొందరిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు, విజయవాడ ఆస్పత్రులకు షిప్ట్ చేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook