వరద ప్రభావిత గోదావరి జిల్లాల్లో ( Flood effected Godavari districts ) ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. అటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరద పరిస్థితుల్ని సమీక్షించారు. ముంపు బాధిత ఇళ్లకు తక్షణ సహాయం కింద రెండు వేల రూపాయలు అందించాలని ఆదేశించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి వరద ( Godavari floods ) పోటెత్తుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి ( Third warning level ) దాటి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే బ్యారేజ్ ఎగువన విలీన మండలాలు, దేవీపట్నం, పోలవరం మండలాల్లోని పలు గ్రామాలు, అటు బ్యారేజ్ దిగువన కోనసీమ లంక గ్రామాలు నీట మునిగాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. గోదావరి జిల్లాల్లో నెలకొన్న వరద పరిస్థితిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఏరియల్ సర్వే ( Aerial survey ) ద్వారా సమీక్షించారు.  సీఎం వెంట మంత్రులు సుచరిత, పేర్ని నాని ఉన్నారు.  ఏరియల్ సర్వే కంటే ముందు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సహాయ పునరావాస కార్యక్రమాల్నివేగవంతం చేయాలని కోరారు.



ముంపు బాధితుల పట్ల మానవత్వంతో ఉదారంగా వ్యవహరించాలని..ఇంట్లో సమస్యగా భావించాలని సీఎం జగన్ ( cm jagan ) కోరారు. తక్షణ సహాయంగా ముంపు ఇళ్లకు 2 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని సూచించారు. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థల్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలన్నారు. వరద తగ్గుముఖం పట్టగానే...పది రోజుల్లోనే పంట నష్టం అంచనాల్ని పంపించాలన్నారు. Also read: AP: సీఎం వైఎస్ జగన్ కు చంద్రబాబు లేఖ