ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆయన మరికాసేపట్లో ఢిల్లీ బయలుదేరాల్సి ఉంది. అయితే అమిత్‌ షా (Amit Shah) షెడ్యూల్ మారడం వల్ల చివరి నిమిషంలో జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా వేయాల్సి వచ్చింది. తొలుత షెడ్యూల్ ప్రకారం సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయిన తరుణంలో అనుకోకుండా పర్యటన రద్దయింది. మళ్లీ పుట్టుకొచ్చిన ఎబోలా వైరస్.. మొదలైన మరణాలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో (Amit Shah) పాటు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ను (Gajendra Singh Shekhawat) సీఎం జగన్‌ కలవాలని భావించారు. ఏపీలో ప్రస్తుతం కరోనా వైరస్‌ (Coronavirus) వ్యాప్తి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తీరు, లాక్ డౌన్ సడలింపులు (Lockdown 5.0), విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన అనంతరం తీసుకున్న చర్యలపై చర్చించాలని వైఎస్ జగన్ ప్లాన్ చేసుకున్నారు. గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్


కాగా, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే ప్రజాకర్షక పాలనను సీఎం వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారు. ప్రతిపక్ష టీడీపీ నేతల విమర్శలు దీటుగా ఎదుర్కొంటూనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తన వంతు పాలన అందిస్తున్నారు. కరోనా వైరస్‌ విషయంలో భారీగా టెస్టులు నిర్వహించి పాజిటివ్‌గా తేలిన వారిని కోవిడ్19 సెంటర్లకు తరలించి చికిత్స అందిస్తున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి