Ys jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు ఆదాయ వనరులపై దృష్టి పెట్టారు. రాష్ట్రానికి మెరుగైన ఆదాయం లభించే మార్గాల్ని ఆలోచించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా సహజవనరులపై అధికార్లతో చర్చించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ప్రభుత్వానికి ( Ap government ) ఇప్పుడు ఆదాయ వనరుల్ని పెంచడం ప్రధాన లక్ష్యంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటికే చాలా రకాల సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఇటు సంక్షేమ పథకాలకు నిధుల సమస్య రాకుండా, అభివృద్ధి కుంటు పడకుండా ఉండేందుకు ఆదాయ వనరులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) అధికార్లకు సూచించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో టెండర్ల ద్వారా దక్కించుకున్న బొగ్గు గనుల కార్యకలాపాలపై మరింత ఫోకస్ పెట్టాలని సూచించారు. ఎర్ర చందనం విక్రయం విషయంలో కేంద్రంతో చర్చించి త్వరగా అనుమతులు తీసుకోవాలని చెప్పారు. అదే విధంగా సిలికా శాండ్ విషయంలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. 


ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ( Ap mineral development corporation )టెండర్ల ద్వారా దక్కంచుకున్న జార్ఘండ్ బ్రహ్మదిహ కోల్‌మైన్, మధ్యప్రదేశ్‌లోని సులియారీ, ఛత్తీస్‌ఘడ్‌లోని మదన్‌పూర్ సౌత్ బొగ్గు గనుల నిర్వహణ, మైనింగ్ కార్యకలపాల్ని నిర్ణీత గడువులోగా ప్రారంభించేందుకు చూడాలని ముఖ్యమంత్రి జగన్ ( Ap cm ys jagan ) ఆదేశించారు. నవరత్నాలులో భాగంగా అమలు చేస్తున్న అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ చేయూత, కాపునేస్తం, నేతన్న నేస్తం వంటి పథకాలకు నిధులు సకాలంలో సమకూర్చాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో అపారంగా ఉన్న ఎర్ర చందనం నిల్వల్ని విక్రయించేందుకు కేంద్రం నుంచి అనుమతులు త్వరగా తీసుకోవాలని అటవీశాఖ అధికారులకు సూచించారు. ఈ వ్యవహారంలో ఎక్కడా అవినీతి లేకుండా పారదర్శకంగా చర్యలు చేపట్టాలన్నారు. 


Also read: Polavaram project: శరవేగంగా పోలవరం పనులు, పూర్తయిన స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదంరాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook