ఏపీ ప్రభుత్వం ( Ap Government ) మరో కీలక పధకం ప్రారంభించింది. సంక్షేమ పధకాల్ని పెద్దఎత్తున చేపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్  ( Ap cm ys jagan ) మరో ముఖ్యమైన పధకాన్ని ప్రారంభించారు. నిరుపేద కుటుంబాల కోసం వైఎస్సార్ భీమా పధకానికి శ్రీకారం చుట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


2019 ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( Ysr congress party ) వినూత్న పథకాలతో ప్రజా ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని వరుసగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని సాహసోపేత నిర్ణయాలు, కొన్ని వినూత్న పథకాలు, మరికొన్నివివాదాస్పద నిర్ణయాలు.ఇవన్నీ ఎలాగున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏడాదిన్నర పూర్తి కాకుండానే 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత దక్కించుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇప్పుడు ఇందులో భాగంగానే మరో కీలక పధకాన్ని ప్రారంభించారు.


నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( ys jagan ). క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్‌ బీమా పథకం  ద్వారా బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరనుంది. కుటుంబ యజమానికి జీవన భద్రత కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. కోవిడ్‌ వైరస్ కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి సరిగ్గా లేనప్పటికీ.. నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేసినట్టు సీఎం జగన్‌ తెలిపారు. భీమా పథకం ప్రయోజనాల్ని స్వయంగా వైఎస్ జగన్ వెల్లడించారు.


నిరుపేదల కోసమే వైఎస్సార్‌ బీమా పథకం ( ysr bheema scheme ) తెచ్చామని.. కేంద్రం తప్పుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం భరిస్తుందన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వ వాటాతో ఏపీలో పేదలకు బీమా పథకం అమలయ్యేది. వివిధ కేంద్ర పథకాల కింద ప్రతీ పాలసీకి కేంద్ర ప్రభుత్వం 50 శాతం వాటా ఇచ్చేంది. కానీ కేంద్రం నుంచి బీమా సాయం లభించడం ఆగిపోయాక పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఇందులో పలుమార్పులు చేసి అమలు చేస్తున్నారు. ఏడాదికి 510 కోట్లు ప్రీమియం చెల్లిస్తున్నామని.. ఈ పథకంతో కోటి 41 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. గ్రామ సచివాలయాల్లో ఇన్సూరెన్స్‌ జాబితా పెడతామని.. ప్రమాదాల్లో మరణించిన, వైకల్యం కలిగిన కుటుంబాలకు బీమా కవరేజీ ఉంటుందన్నారు. 18-50 ఏళ్ల వయస్సు వారు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల బీమా, సహజ మరణానికి 2 లక్షల రూపాయల బీమా ఉంటుందని వైఎస్ జగన్ చెప్పారు. ప్రమాదవశాత్తు పాక్షిక వైకల్యం కలిగితే 1 లక్ష 50 వేల రూపాయలు వస్తాయని.. 51-70 ఏళ్ల వయస్సువారు మరణిస్తే  3 లక్షల రూపాయలు  బీమా వర్తిస్తుందన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయినవారి కుటుంబాలకు తక్షణ సహాయంగా 10 వేల రూపాయలు అందిస్తామన్నారు.  


పేదలకు భూముల పంపిణీ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలుమార్లు ప్రయత్నించినా హైకోర్టు ( Ap High court ) ఆదేశాలతో బ్రేక్ పడింది. మరోవైపు ఏపీ మూడు రాజధానుల అంశం సైతం హైకోర్టు నిర్ణయంతోనే నిలిచిపోయింది.  కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ..కరోనా వైరస్ సంక్షోభం  ఆర్ధికంగా వెంటాడుతున్నప్పటికీ సంక్షేమ పథకాలను మాత్రం అమలు చేసుకుంటూ పోతున్నారు వైఎస్ జగన్. 


ముఖ్యమంత్రిగా బాథ్యతలు స్వీకరించిన తరువాత ప్రధానంగా విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించారు జగన్. నాడు నేడు ( Naadu-nedu ) పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారు చేస్తున్నారు. Also read: AP Inter Admission 2020: ఏపీలో ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం నేడే