YS Jagan: శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టు విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య పేచీ పెద్దదవుతోంది. తెలంగాణ వైఖరిపై ఏపీ మండిపడుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ప్రధాని మోదీకు లేఖ రాశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వివాదం మదురుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ వైఖరిని వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని కోరారు. ఇవాళ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ(Ap cm ys jagan) రాశారు.


శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వివాదం (Srisailam power project dispute)పై ఫిర్యాదు చేస్తూ..తక్షణం కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం (Telangana government) చట్ట విరుద్ధంగా ఆపరేషన్ ప్రోటోకాల్ ఉల్లంఘిస్తోందని..కేఆర్ఎంబీ పరిధిని నోటి ఫై చేసేలా జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని జగన్ లేఖలో కోరారు. శ్రీశైలంలో నీటిమట్టం పెరగకుండా నీటిని తెలంగాణ తోడేస్తోందని..ఫలితంగా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు సాగునీరు అందడం లేదని జగన్ తెలిపారు.కేఆర్ఎంబీకు ఏ విధమైన సమాచారం ఇవ్వకుండానే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఫలితంగా కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాంతాలకు ఇబ్బంది కలుగుతోంది. రెండు రాష్ట్రాల ప్రయోజనాల్ని పరిరక్షించే విధంగా సీఐఎస్ఎఫ్ (CISF) బలగాల పరిధిలో ప్రాజెక్టులను తీసుకురావాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేసేలా కేంద్ర జలశక్తిశాఖకు ఆదేశాలివ్వాలన్నారు.


Also read: AP High Court Jobs: ఏపీ హైకోర్టులో కాంట్రాక్ట్ బేసిస్‌లో కీలక ఉద్యోగాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook