Jagan Strategy: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్. అందరూ జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. మరి జగన్ వ్యూహమేంటి, అసలు పేరు మార్చడానికి కారణం తెలిస్తే..టీడీపీ శ్రేణులకు మాటాగిపోవడం ఖాయం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ నడుస్తోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నుంచి ఎన్టీఆర్ పేరు తొలగించి డాక్టర్ వైఎస్సార్ పేరును చేర్చడం వివాదాస్పదమౌతోంది. టీడీపీ నేతలు చంద్రబాబు సహా అందరూ ఇదే అంశంపై రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అన్నిచోట్లే ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. 


ఈ అంశం ఎంత హాట్ టాపిక్‌గా మారిందంటే వైసీపీ శ్రేణులు కూడా కొంతమంది తమ అధినేత తప్పు చేశాడా అనుకునేలా ఉంది. ఇప్పటికే రాజధాని సమస్య ఉండగా..మరో కొత్త సమస్యను ఎందుకు కొనితెచ్చుకోవడమని విమర్శించేవాళ్లు కూడా లేకపోలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడం ద్వారా వైఎస్ జగన్ ప్రతిపక్షాలకు అవకాశమిచ్చారని వాదించేవాళ్లు కూడా ఉన్నారు. కానీ దీనివెనుక పెద్ద మతలబే ఉందని తెలుస్తోంది. ఇదంతా వైఎస్ జగన్ వేసిన స్కెచ్ అనేది రాజకీయ విశ్లేషకుల వాదన. టీడీపీ నేతలు సైతం జగన్ స్కెచ్‌లో పడ్డారని తెలుస్తోంది. 


వైఎస్ జగన్ వ్యూహమేంటి


నిజానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడం వెనుక పెద్ద మర్మమే ఉంది. ఎన్టీఆర్ ఖ్యాతిని తగ్గించడమో లేదా తొలగించడమో జగన్ ఉద్దేశ్యం కాదు. ఇప్పటికే జగన్‌కు ఎన్టీఆర్ అంటే ఎనలేని గౌరవముంది. అయితే టీడీపీ వర్సెస్ ఎన్టీఆర్ ప్రభావాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పే ప్రయత్నంలో ఇదంతా జరిగింది. పేరును తొలగించడం ద్వారా రాష్ట్రంలో ఈ అంశం చర్చకు వచ్చేలా చేశారు. అదే చర్చ సందర్భంగా ఎన్టీఆర్‌ను నాడు చంద్రబాబు అండ్ కో ఎలా మోసం చేశారు, ఆయనపై ఎన్ని నిందలేశారు, ఎలా దూషించారు, ఆయన విలువల్ని దిగజార్చేందుకు చేసిన ప్రయత్నాలేంటి ఇవన్నీ ప్రజల ముందుంచాలనేదే జగన్ వ్యూహం. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది. నాడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు చేసిన వెన్నుపోటు ఎపిసోడ్ మొత్తం మరోసారి ప్రజలకు గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 


14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఓ మండలానికైనా ఎన్టీఆర్ పేరెందుకు పెట్టలేదు, నాడు వైశ్రాయి హోటల్ ముందు చెప్పులు విసిరినప్పుడు ఎన్టీఆర్ నైతికత గుర్తు రాలేదా, ఈనాడులో ఎన్టీఆర్‌పై అనైతికంగా రాసినప్పుడు ఆయన గౌరవం ఏమైందనే ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. టీడీపీకు వెన్నంటిగా ఉండేవర్గం కాకుండా మిగిలిన సామాజిక వర్గాలకు ఎన్టీఆర్ పట్ల చంద్రబాబు అండ్ కో వ్యవహరించిన తీరును అర్ధమయ్యేలా చెప్పడమే ఆ వ్యూహం. జగన్ స్కెచ్‌లో భాగంగానే ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతోంది. 


జగన్ నిర్ణయంతో లాభమా, నష్టమా


అయితే వైఎస్ జగన్ అనవసరంగా ఇలాంటి నిర్ణయం తీసుకుని తప్పు చేశారేమో అని వాదించేవాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి వ్యవహారాలు ఎప్పుడూ ఓట్లను ప్రభావితం చేయలేవు. అంతకంటే మించి ఇప్పుడేమీ ఎన్నికల సమయం కూడా కాదు. మరో ఏడాదిన్నర వ్యవధి కచ్చితంగా ఉంది. అంటే ఓట్ల పరంగా జగన్‌కు నష్టం లేదు. పైపెచ్చు ప్రజల్లో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు..చంద్రబాబు అండ్ కో వైశ్రాయ్ ఎపిసోడ్ ప్రజల ముందుకు రావల్సిందే. ఇదే జగన్ వ్యూహం. అదే జరుగుతోంది. 


Also read: NTR Health University: వైఎస్ జగన్ సర్కారుకి పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook