AP: మూడు రాజధానుల పరిష్కారానికి జగన్ మాస్టర్ ప్లాన్ ఇదేనా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శైలి ఎప్పుడూ ప్రత్యేకమే. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల్ని ప్రకటించి విస్మయపరిచారు. ఇప్పుడు అదే దిశగా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఇంతకీ జగన్ వ్యూహమేంటి..
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శైలి ఎప్పుడూ ప్రత్యేకమే. దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు రాజధానుల్ని ప్రకటించి విస్మయపరిచారు. ఇప్పుడు అదే దిశగా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. ఇంతకీ జగన్ వ్యూహమేంటి..
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) రాష్ట్రానికి మూడు రాజధానుల్ని( Three capitals ) ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్న జగన్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. న్యాయ రాజధానిగా కర్నూలు నగరాన్ని, శాసనసభ రాజధానిగా అమరావతిని, ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖపట్నం ( Executive capital ) ను ప్రకటించారు. అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అభివృద్ది ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాకుండా..రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు న్యాయం చేస్తూ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలే ఎక్కువగా విన్పించాయి.
అయితే ప్రతిపక్షం తెలుగుదేశం ( Telugu desam ) పార్టీకు ఈ నిర్ణయం మింగుడు పడలేదు. అమరావతి ( Amaravati ) లోని కొంతమంది రైతులతో కలిసి నిరసనకు దిగారు. దాదాపు 7-8 నెలల్నించి ధర్నాలు చేస్తున్నారు. అటు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రభుత్వ నిర్ణయంపై స్టే తెచ్చుకున్నారు. మరోవైపు రాజధాని పేరుతో అమరావతిలో భూముల కుంభకోణం జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ దర్యాప్తు చేపట్టింది. కీలకవ్యక్తులకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించింది. Also read: AP: హైకోర్టు గ్యాగ్ ఆర్డర్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు
అయితే కోర్టు అడ్డంకుల నేపధ్యంలో మూడు రాజధానుల అంశం నుంచి వెనక్కి తగ్గని వైఎస్ జగన్ ( ys jagan ) మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. అనుకున్నది సాధించడమే జగన్ నైజమనేది అందరికీ తెలిసిందే. అదే దిశగా ముందుకుపోతున్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఎంపిక చేసిన విశాఖపట్నం అభివృద్ధికి..మౌళిక సదుపాయాలు కల్పన దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. కోర్టు తీర్పు వచ్చేలోగా..విశాఖను మరింతగా అభివృద్ధి చేస్తే..సమయాలాపన లేకుండా ఉంటుందనేది వైఎస్ జగన్ ఆలోచన.
ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా పోర్టులు, ఎయిర్ పోర్టులపై దృష్టి సారించారు. విశాఖ కేంద్రంగా ఉన్న తీరప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని ఫిషింగ్ హార్బర్, పోర్టుల్ని అభివృద్ధి చేయనున్నారు. మరీ ముఖ్యంగా విశాఖపట్నం సమీపంలో తలపెట్టిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ( Bhogapuram international airport ) పై ఫోకస్ పెట్టారు. ఈ విమానాశ్రయాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. విమానాశ్రయం నుంచి విశాఖకు త్వరగా చేరుకునేలా బీచ్ రోడ్డు నిర్మాణం పూర్తి కావాలని స్పష్టం చేశారు.
మరోవైపు విశాఖ మహానగరానికి తాగునీటి కొరత తీర్చేందుకు బృహత్ ప్రణాళికను సిద్ధం చేశారు. పోలవరం నుంచి పైపులైన్ ద్వారా విశాఖ నగరానికి గోదావరి నీరు తరలించే ప్రణాళిక సిద్ధమైంది. పూర్తిగా గ్రావిటీపై నీళ్లు అందించేలా డీపీఆర్ సిద్ధం చేయాల్సి ఉంది. వీటికి సంబంధించిన పనుల శంకుస్థాపనల్ని సంక్రాంతిలో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. Also read: AP: వేసవి నాటికి మరో 16 వందల మెగావాట్ల విద్యుత్
మరోవైపు విశాపట్నం–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లోని విశాఖపట్నం నోడ్‌లో అచ్యుతాపురం క్లస్టర్, నక్కపలి క్లస్టర్లో పనుల తీరును అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వివరించారు. రాంబిల్లి ప్రాంతంలో పోర్టు నిర్మించే అవకాశాల్ని పరిశీలించాలని కోరారు. తద్వారా విశాఖపట్నం పోర్టుపై ఒత్తిడి తగ్గుతుంది. అటు కాలుష్యం కూడా తగ్గుతుంది.
ఇక అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ మెట్రో ప్రాజెక్టు ( Visakhapatnam metro project )కు డీపీఆర్ సిద్ధమవుతోంది. ఇప్పటికే విశాఖ మెట్రో కార్యాలయాన్ని విశాఖపట్నం నగరంలో ప్రారంభించారు. స్టీల్ ప్లాంట్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ వరకూ మెట్రో కనెక్టివిటీని ప్రభుత్వం ప్రతిపాదించింది.
ఇలా విశాఖపట్నం ( Visakhapatnam ) లో అన్ని విధాల అభివృద్ధి, మౌళిక సదుపాయాల కల్పన ద్వారా మూడు రాజధానుల ( Three capitals decision) నిర్ణయం దిశగా ముందుకు కదులుతున్నారు వైఎస్ జగన్. ఎంతైనా మాటమీద నిలబడటం అతనికే చెల్లుతుంది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా రాజధానుల అంశంలో జోక్యం చేసుకోమని..పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని తేల్చి చెప్పేసింది. Also read: AP: ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. స్టే ఆర్డర్ రద్దు