Ys Jagan: ఏపీలో వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నిమిత్తం భారీగా నిధులు జమచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల్ని అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ విషయంలో గత ప్రభుత్వానికి..ఇప్పటికీ ఉన్న తేడాను వివరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రకాల సంక్షేమ పథకాలు అమల్లో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని సంక్షేమ పథకాల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సహాయం అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన 9 లక్షల 30 వేలమంది లబ్దిదారుల సహాయం కోసం 703 కోట్ల రూపాయల్ని జమ చేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 44 వేల 497 మందికి పెన్షన్ కార్డులు, 3 లక్షల 7 వేల 599 మందికి బియ్యం కార్డులు, 1 లక్షా 10 వేల 880 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు, లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan)..అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామన్నారు. గతంలో ఇప్పటికీ ఉన్న తేడాను వివరించారు.


గత ప్రభుత్వ హయాంలో పథకాల (Welfare Schemes)కోసం ప్రజలు ఎదురుచూసేవారని..ఇప్పుడు మాత్రం ప్రభుత్వమే నేరుగా ప్రజల్ని వెతుక్కుంటూ పథకాలు అందిస్తోందని వైఎస్ జగన్ చెప్పారు. కులం, మంతం, రాజకీయ పార్టీలనే బేధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా పొరపాటున అర్హత ఉండి పథకాలు అందనివారికి కూడా ఈసారి అందించే కార్యక్రమం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికీ మిస్ కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. గత ప్రభుత్వాలైతే సంక్షేమ పధకాల్ని ఎలా కట్ చేయాలనే విషయంపై ఆలోచన చేసేవన్నారు. వివిధ కారణాలతో మిస్ అయినవారికి కూడా మరో అవకాశమిచ్చి అందరికీ అందేలా చేస్తున్న ప్రభుత్వం దేశంలో తమదేనన్నారు. పెన్షన్ విషయమైనా, రేషన్ కార్డులైనా, ఇతర సంక్షేమ పథకాలైనా సరే గత ప్రభుత్వంతో అన్ని రకాలుగా భిన్నంగా మెరుగ్గా అందిస్తున్నామన్నారు. 


తెలుగుదేశం (Telugu Desam)ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు 2 నెలల ముందువరకూ నెలకు వేయి రూపాయలిచ్చేవారని వైఎస్ జగన్ వివరించారు. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వం 39 లక్షలమందికి కలిపి 4 వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే..ఇప్పుడు 61 లక్లమందికి 1450 కోట్ల మేర పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఇంకా తెలవారకుండానే వాలంటీర్ ఇంటికొచ్చి..గుడ్ మార్నింగ్ చెబుతూ చేతిలో పెన్షన్ డబ్బులు పెడుతుంటే అంతకుమించిన ఆనందం ఏముంటుందన్నారు. జనవరి 1 నుంచి పెన్షన్‌ను 2 వేల 5 వందల రూపాయలు చేస్తున్నామన్నారు. 


Also read: Eluru Rape Case: యువతిపై సీఐ అత్యాచారం..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook