Eluru Rape Case: యువతిపై సీఐ అత్యాచారం..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

Eluru Rape Case: ఓ యువతి (19) పై సీఐ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.   

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 28, 2021, 11:32 AM IST
  • ఏలూరులో దారుణ ఘటన
  • యువతిపై సీఐ అత్యాచారం
  • విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ
Eluru Rape Case: యువతిపై సీఐ అత్యాచారం..ఆలస్యంగా వెలుగులోకి ఘటన..

Eluru Rape Case: ప్రజలను రక్షించాల్సిన పోలీస్ అధికారి నీచానికి పాల్పడ్డాడు. ఏలూరులో ఓ యువతిపై సీఐ అత్యాచారానికి (police raped) పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గతంలో యువతిపై సీఐ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు తాజాగా బయటపడింది. 

వివరాల్లోకి వెళితే...

పశ్చిమ గోదావరి జిల్లా (west godavari district) ఏలూరులో (Eluru ) ట్రాఫిక్ విభాగంలో సీఐగా బాల రాజాజి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో అతడు ఏలూరు వన్ టౌన్ లో సీఐగా (CI) పనిచేశారు. ఈ సమయంలోనే అతడు ఓ యువతిని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా ఆ విషయాన్ని యువతి బయటపెట్టడంతో..ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. యువతిపై అత్యాచార ఆరోపణల నేపథ్యంలో సదరు సీఐ రాజాజిని వీఆర్ కి తరలించారు ఉన్నతాధికారులు. అలాగే ఈ కేసును (Eluru rape case) సుమోటోగా తీసుకుని అత్యాచార ఘటనపై విచారణ చేయాలని డిఎస్పీ దిలీప్ కిరణ్ ని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశించారు.

Also Read: Video: బాయ్‌ఫ్రెండ్ కోసం పబ్లిక్‌లో కసితీరా కొట్టుకున్న వైజాగ్ గర్ల్స్...

ఈ ఘటనపై మహిళలు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పోలీసు అధికారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. రక్షించాల్సిన పోలీసులే ఇలాంటి దారుణాలకు పాల్పడితే..రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News