Aarogyasri app: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. మరోవైపు త్వరలో ప్రత్యేక యాప్ అందుబాటులో రానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్యశ్రీ సేవలకు ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan)తెలిపారు. నాడు-నేడు, ఆరోగ్య సేవలు, ఆరోగ్యశ్రీ సేవలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. అధికారులతో సమగ్రంగా వివిధ అంశాలపై చర్చించిన వైఎస్ జగన్..ఇందుకు అనుగుణంగా ఆదేశాలిచ్చారు.కేంద్రంతో సమన్వయం చేసుకుని నిర్దేశించిన వయస్సులవారికి డబుల్ డోస్ కచ్చితంగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తేనే కోవిడ్ నియంత్రణ సాధ్యమౌతుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. 


ఒమిక్రాన్ సంక్రమణ నేపధ్యంలో ఎయిర్‌పోర్టుల్లో విధిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. ఒమిక్రాన్ నేపధ్యంలో ఆంక్షలు విధించామన్నారు. వారం రోజుల్లో జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్నింటికంటే మించి త్వరలో ఆరోగ్య సేవలు, ఆరోగ్యశ్రీకు సంబంధించి ప్రత్యేక యాప్ తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇందులో సందేహాల్ని నివృత్తి చేసేలా యాప్‌లో అన్ని సదుపాయాలుండాలని సూచించారు. యాప్‌ను ఆరోగ్యమిత్రలకు ఇవ్వనున్నారు. ఈ యాప్‌లో ఆరోగ్య సేవలతో పాటు ఆరోగ్యశ్రీ(Aarogyasri) వివరాలన్నీ అందుబాటులో ఉండాలన్నారు. 


Also read: AP Omicron Update: ఏపీలో తొలి ఒమిక్రాన్ వ్యక్తికి కోవిడ్ నెగెటివ్, ఇప్పుడు రాష్ట్రంలో జీరో కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook