కేంద్ర ప్రభుత్వం ( Central Government ) ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యావిధానం ( National Education policy ) పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విస్తృతంగా సమీక్ష ( cm ys jagan review ) నిర్వహించారు. జాతీయ విద్యావిధానంలో ఉన్న అంశాలేంటి..ప్రస్తుత విద్యా విధానం ఎలా ఉందనేదానిపై చర్చించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


జాతీయ విద్యావిదానం 2020 ( National Education policy 2020 ) ను రాష్ట్రంలో అమలు చేయడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌–రీసెర్చ్‌ ఓరియెంటేషన్‌ ప్రధాన లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరం నుంచే నాలుగేళ్ల హానర్స్‌ డిగ్రీ కోర్సు ( 4 years Degree honours course ) ప్రారంభిస్తున్నట్లు అధికారులు సమీక్షలో వెల్లడించారు. అన్ని కాలేజీలు మూడేళ్లలో పూర్తి ప్రమాణాలు సాధించాలని..తప్పనిసరిగా ఎన్‌ఏసీ, ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ పొందాలని సూచించారు. అన్ని కాలేజీలలో రెగ్యులర్‌గా తనిఖీలు చేయాలని..ముఖ్యంగా టీచర్‌ ట్రెయినింగ్‌ కాలేజీలపై దృష్టి పెట్టమని ఆదేశించారు. ప్రమాణాలు పాటించకపోయినా..మార్పు రాకపోయినా కళాశాలలు మూసివేయాలని తెలిపారు. 


ఉన్నత విద్యలో అడ్వాన్స్‌డ్‌ టాపిక్స్‌తో కోర్సులు ప్రారంభించాలని...ఏడాది లేదా రెండేళ్ల పీజీ కోర్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. నాలుగేళ్ల డిగ్రీ చేసిన వారికి పీహెచ్‌డీలో నేరుగా అడ్మిషన్ ఉంటుందన్నారు. ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కళాశాలలు సహా అన్ని కాలేజీలకు నోటీసులు జదారీ చేయాలని సూచించారు. బీఈడీ కళాశాలలు, టీచర్ ట్రైనింగ్ సంస్థల్లో క్వాలిటీ లేకపోతే నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలన్నారు.  


మరోవైపు రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ కోర్సుల్లో మార్పులు చేశారు. ఇకపై రాష్ట్రంలో ఏడాది లేదా రెండేళ్ల పీజీ ప్రోగ్రాములుంటాయని..డిగ్రీ మూడు లేదా నాలుగేళ్లుంటుందని నిర్ణయించారు. ఈ ఏడాది నుంచే కొత్త కోర్సుల్ని ప్రారంభించనున్నారు.  వచ్చే ఏడాది నుంచి 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్‌ పీజీ ప్రోగ్రామ్స్‌, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. విద్యార్థులకు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగానే ఉన్నత విద్యలో అడ్వాన్స్‌డ్‌ టాపిక్స్‌తో కోర్సులు రూపొందించనున్నారు. రోబొటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్‌ వంటి కొత్త కోర్సులు ప్రారంభించడానికి నిర్ణయించారు.  బికామ్‌లో సెక్యూరిటీ (స్టాక్‌) అనాలిసిస్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి అంశాలు కూడా పొందుపర్చనున్నారు. 


మరోవైపు  విజయనగరం, ఒంగోలులో కొత్తగా యూనివర్సిటీలు ( New Universities ) ప్రారంభించనున్నారు. విజయనగరంలో ఇంజనీరింగ్‌ విద్యను ఫోకస్‌ చేస్తూ..మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీని,  టీచర్‌ ఎడ్యుకేషన్‌ ఫోకస్‌ చేస్తూ ఒంగోలు యూనివర్సిటీని స్థాపించనున్నారు. Also read: AP: కరోనా సెకండ్ వేవ్ కచ్చితంగా ఉంటుంది