Corona vaccination: వ్యాక్సినేషన్ ఉధృతం చేయాలని ఆదేశించిన వైఎస్ జగన్
Corona vaccination: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు.
Corona vaccination: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు.
కరోనా వైరస్ మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రణాళికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్(Ap cm ys jagan review) అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉధృతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. నాలుగైదు వారాల వ్యవధిలో కోటిమందికి వ్యాక్సిన్ ఇవ్వాలని పేర్కొన్నారు. సోమవారం నుంచి అంటే ఈ నెల 29 నుంచి అర్బన్ ప్రాంతాల్లో సైతం వ్యాక్సినేషన్(Corona vaccination)చేపట్టాలని స్పష్టం చేశారు. రూరల్ ఏరియాలో మండలంలో వారానికి 4 రోజులు, రోజుకు 2 గ్రామాల చొప్పున పైలట్ ప్రాజెక్ట్‌గా వ్యాక్సినేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
ప్రస్తుతం ఎదురవుతున్న లోపాల్ని సరిదిద్దిన తరువాత వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఒక యజ్ఞంగా వేగవంతం చేయాలన్నారు. జడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల(Zptc-Mptc Elections)ప్రక్రియలో మరో వారం రోజులు మాత్రమే మిగిలుందని..ఇవి కూడా పూర్తయి ఉంటే వ్యాక్సినేషన్‌పై పూర్తిగా దృష్టి పెట్టేవాళ్లమన్నారు. ఇప్పుడా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. దాంతో వ్యాక్సినేషన్‌కు అడ్డంకులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ప్రజారోగ్యానికి భంగం కల్గించే ఇలాంటి పరిస్థితులకు బాధ్యులెవరనే ప్రశ్న తలెత్తుతుందని స్పష్టం చేశారు.
Also read: Rajyasabha: తిరుమలపై జీఎస్టీ ఉపసంహరించుకోవాలంటూ వైసీపీ నేత డిమాండ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook