CM Jagan on Pawan Kalyan: శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ.. రూ.700 కోట్లతో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్ట్, రూ.85 కోట్లతో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన పలాసలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై సెటైరికల్ కామెంట్స్ చేశారు. "ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తా అని తెలంగాణలో డైలాగ్లు కొట్టాడు ఈ ప్యాకేజీ స్టార్.. మ్యారేజీ స్టార్. ఆంధ్రాకు వ్యతిరేకంగా ఆయన డైలాగులకు తెలంగాణలో పడిన ఓట్లు ఎన్నో తెలుసా..? అక్కడ ఇండిపెండెంట్‌గా నిలబడ్డ నా చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా ఈ దత్తపుత్రుడి పార్టీకి రాలేదు. డిపాజిట్లు కూడా దక్కలేదు" అని ఎద్దేవా చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికలు వచ్చే సరికి ఎత్తులు, పొత్తులు, చిత్తులు మీద ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆధారపడతారని సీఎం జగన్ అన్నారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారని.. నాన్‌ లోకల్‌ ప్యాకేజీ స్టార్‌.. బాబు ఇంకో పార్ట్‌నర్‌ అని విమర్శించారు. ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగులు కొట్టాడని.. కానీ అక్కడ దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా దక్కలేదన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన నా చెల్లెమ్మ బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదంటూ సెటైర్లు వేశారు.


విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటే అడ్డుకుంటున్నారని సీఎం జగన్ ఫైర్ అయ్యారు. విశాఖకు ముఖ్యమంత్రి వచ్చి ఉంటానంటే ఏడుస్తున్నారని.. నాన్‌ లోకల్స్‌ పక్క రాష్ట్రంలో ఉండి మన రాష్ట్రంలో ఏం చేయాల్లో నిర్ణయిస్తామంటారంటూ మండిపడ్డారు. ఉద్దానం అంటే ఉద్యానవనం అని.. ఉద్దానం ప్రజల బాధను పాదయాత్రలో చూశానని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ తీసుకొచ్చామన్నారు. 


ఎన్నికల సమయంలో ఉద్దానం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చామన్నారు సీఎం జగన్. దాదాపు రూ.85 కోట్లతో నిర్మాణాలు చేపట్టామని.. సురక్షిత మంచి నీటి కోసం రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. 


రాష్ట్రంలో 13 వేల మందికిపైగా డయాలసిస్‌ రోగులకు పెన్షన్ ఇస్తున్నామని.. ప్రతీ నెలా పెన్షన్ల కోసం రూ.12 కోట్ల 54 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు మూల కారణం తెలుసుకునేందుకు సమగ్రంగా అధ్యయనం మొదలుపెట్టామన్నారు. మార్కాపురంలోనూ మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా వారిని ఆదుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నామన్నారు. 


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 


Also Read: World in 2023: ప్రపంచం ఎప్పటికీ మర్చిపోని ఘటనలు, ప్రమాదాలు, పరిణామాలకు సాక్ష్యం 2023



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి