World in 2023: ప్రపంచం ఎప్పటికీ మర్చిపోని ఘటనలు, ప్రమాదాలు, పరిణామాలకు సాక్ష్యంగా నిలిచిన 2023

World in 2023: మరి కొద్దిరోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. 2023 మిగిల్చిన అనుభూతులు, జ్ఞాపకాల నుంచి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నాం. 2023 ప్రపంచ గుర్తుంచుకోదగిన ఎన్నో పరిణామాలకు సాక్ష్యంగా నిలిచింది. ఆ వివరాలు ఇవీ..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 14, 2023, 04:48 PM IST
World in 2023: ప్రపంచం ఎప్పటికీ మర్చిపోని ఘటనలు, ప్రమాదాలు, పరిణామాలకు సాక్ష్యంగా నిలిచిన 2023

World in 2023: 2023లో ప్రపంచాన్ని కుదిపేసిన భూకంపాలు చోటుచేసుకున్నాయి. అగ్ని పర్వతాలు బద్లలయ్యాయి. భీకర యుద్దాలకు సాక్ష్యంగా నిలిచింది. కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఊహించని పరిణామాలకు వేదికైంది. తుపాన్లు, వరదలు విలయం సృష్టించాయి. అలాంటివాటిలో కొన్ని మీ కోసం..

ఫిబ్రవరి 5న ఫ్రెడ్డీ తుపాను మలావి,  మొజాంబిక్, నైరుతి ఆఫ్రికాలో విలయం సృష్టించింది. 1400 మందికి పైగా మరణించారు. ఇప్పటి వరకూ సుదీర్ఘకాలం కొనసాగిన ఉష్ణమండల తుపాను ఇది.

టర్కీ సిరియా భూకంపం ఫిబ్రవరి 6వ తేదీన రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో విలయం సృష్టించింది. అది కూడా వరుసగా ఐదుసార్లు భూమి కంపించింది. ఫలితంగా టర్కీలో 59 వేలమంది, సిరియాలో 8 వేల మంది మృత్యువాత పడ్డారు. 

జూన్ 2వ తేదీన ఒడిశా బాలాసోర్ సమీపంలోని మహానగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-యశ్వంత్ పూర్ రైలు, గూడ్స్ రైలు మూడు రైళ్లు ఢీ కొన్ని అత్యంత దారుణమైన ప్రమాదం. 300 మంది మరణించగా 12 వందల మంది గాయపడ్డారు. 

జూన్ 18న ప్రపంచాన్ని నివ్వెరపర్చిన ఘటన జరిగింది. కెనడాలోని న్యూ ఫౌండ్‌లాండ్ తీరానికి సమీపంలో ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో టైటాన్ నౌక శిధిలాలను చూసేందుకు వెళ్తున్న టైటాన్ అనే సబ్‌మెర్సిబుల్ మునిగిపోయింది. అందులోని ప్రయాణీకులంతా మరణించారు. 

ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ 2022లోనే కొనుగోలు చేసినా జూలై 2023 నుంచి అధికారికంగా పేరు మార్చుకుంది. ట్విట్టర్ కాస్తా ఎక్స్ అయింది. 

అక్టోబర్ 7వ తేదీన పాలస్తీనాలోని మిలిటెండ్ విభాగం హమాస్ ఇజ్రాయిల్‌పై 5 వేల రాకెట్లతో దాడులు చేయడంతో ఇజ్రాయిల్-పాలస్తీనా యుద్ధం ప్రారంభమైంది. ఇంకా కొనసాగుతోంది. 

ఈ ఏడాదిలోనే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచింది. చైనాను దాటి మొదటి స్థానంలో చేరింది. భారతదేశ జనాభా ఇప్పుడు 1.43 బిలియన్లు. కొన్ని దశాబ్దాల వరకూ భారత్ ఈ స్థానాన్ని కొనసాగించనుంది. 

సెప్టెంబర్ 9-10 తేదీల్లో జీ20కు ఆధిత్యమిచ్చిన భారతదేశంలో జీ20 సమ్మిట్ అత్యంత ఘనంగా జరిగింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ అధ్యక్షుడు రిషి సునాక్ సహా ప్రపంచాధినేతలు పాల్గొన్నారు. 

Also read: Joe Biden Impeachment: అభిశంసన విచారణ ఎదుర్కోనున్న జో బిడెన్, సెనేట్‌లో దోషిగా తేలనున్నారా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News