ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ప్రతిష్ఠాత్మక పథకం ప్రారంభమైంది. నిరుపేదలకు ఇళ్ల  పట్టాల పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా మొదలైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ ( House sites Distribution ) కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం కొమరగిరిలో  ముఖ్యమంత్రి జగన్ ( ap cm ys jagan )చేతుల మీదుగా ప్రారంభమైంది. మొన్న నవరత్నాలు..నేడు పేదలకు ఇళ్లు. 15 రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 30.75 లక్షల ఇళ్ల పట్టాల్ని పంపిణీ చేయనున్నారు. దీంతోపాటు రాష్ట్రంలో 28.32 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని తలపెట్టింది ఏపీ ప్రభుత్వం ( Ap Government ). ఇళ్ల నిర్మాణంలో తొలిదశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారు. ముందుగా కొమరగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జగనన్న ఇళ్ల పట్టాల పైలాన్‌ను జగన్ ఆవిష్కరించారు. అదే గ్రామంలో నిర్మించిన మోడల్ హౌస్‌ ( Model house )ను పరిశీలించారు. 


ఎన్నికల మేనిఫెస్టో ( Election Manifesto ) లో ఇచ్చిన హామీ ప్రకారం పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నానన్నారు. 30 లక్షలమందికి పైగా పేదలకు సొంతింటి కలను నిజం చేశామన్నారు. ఇళ్ల స్థలం పరిమితి ఇప్పుడు 224 చదరపు అడుగులుండగా..340 చదరపు అడుగులకు పెంచుతామన్నారు. కోర్టులో నమోదైన అడ్డంకులు తొలగిన తరువాత..లబ్దిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. పట్టాల పంపిణీ ద్వారా ఇళ్ల నిర్మాణంతో కోటిమందికి పైగా ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. 


రాష్ట్రలో 17 వేల వైెఎస్ఆర్ జగనన్న కాలనీలు రానున్నాయని..కొత్తగా ఏర్పడే కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం, పార్క్‌లు, కమ్యూనిటీ హాల్స్, విలేజ్ క్లినిక్‌లు, అంగన్ వాడీ కేంద్రాల్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని జగన్ చెప్పారు. 


Also read: Ys jagan at Christmas: సొంతూరిలో ముఖ్యమంత్రి జగన్ క్రిస్మస్ వేడుకలు