Ys jagan at Christmas: సొంతూరిలో ముఖ్యమంత్రి జగన్ క్రిస్మస్ వేడుకలు

Ys jagan at Christmas: అందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెెందులలో క్రిస్మస్ వేడుకల్ని జరుపుకున్నారు. స్థానిక సీఎస్ఐ చర్చ్ లో కుటుంబసభ్యులతో క్రిస్మస్ ప్రార్ధనలు జరిపారు వైెఎస్ జగన్.

Last Updated : Dec 25, 2020, 12:57 PM IST
Ys jagan at Christmas: సొంతూరిలో ముఖ్యమంత్రి జగన్ క్రిస్మస్ వేడుకలు

Ys jagan at Christmas: అందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పులివెెందులలో క్రిస్మస్ వేడుకల్ని జరుపుకున్నారు. స్థానిక సీఎస్ఐ చర్చ్‌లో కుటుంబసభ్యులతో క్రిస్మస్ ప్రార్ధనలు జరిపారు వైెఎస్ జగన్.

ఆంధ్రప్రదేశ్ ముఖ్మమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) సొంతూరు పులివెందులలో క్రిస్మస్ వేడుకల్ని ( Christmas celebrations ) జరుపుకున్నారు. పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ ప్రార్ధనల్లో వైఎస్ జగన్ సహా ఆయన సతీమణి, వైఎస్ భారతి, వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. క్రిస్మస్‌తో పాటు వైకుంఠ ఏకాదశి రావడం శుభదినమని...ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని వైఎస్ జగన్ తెలిపారు. 

పులివెందుల ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోవడంపై బాధ వ్యక్తం చేశారు వైఎస్ జగన్ ( Ys jagan ). పట్టాలు ఇవ్వవద్దంటూ కొందరు కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. ఏపీఐఐసీ భూములు పేదలు ఇవ్వొద్దని హైకోర్టు ( High court ) స్టే ఇచ్చిందన్నారు. ఏపీఐఐసీ భూముల్లో పరిశ్రమలొస్తే ..అక్కడ  పనిచేసే వారికి ఇళ్లుండాలనే ఉద్దేశ్యంతో పేదలకు అక్కడే ఇళ్లు ఇస్తున్నామన్నారు. మంచి పనులు చేస్తుంటే కొందరు అడ్డుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమం అనంతరం కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజమండ్రికి బయలుదేరుతారు. 

Also read: Vaikuntha Ekadashi: వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

Trending News