AP CMRF Donations: తన వ్యాపార ప్రకటనలతో తెలుగు ప్రజల దృష్టిని ఆకర్షించిన లలితా జ్యువెలర్స్‌ యజమాని కిరణ్‌ కుమార్‌ వరదలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అండగా నిలిచారు. 'డబ్బులు ఎవరికీ ఊరికే రావు' అనే డైలాగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కిరణ్‌ కుమార్‌ మానవత్వం ప్రదర్శించారు. గుండు వేసుకుని టీవీలు.. వాణిజ్య ప్రకటనల్లో కనిపించే గుండు అంకుల్‌ ఏపీ వరదలకు భారీ విరాళం ప్రకటించారు. తన వ్యాపార సంస్థల నుంచి కొంత విరాళాన్ని ఏపీ ముఖ్యమంత్రి నిధికి ఇచ్చారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Floods Damage: ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని దెబ్బ.. వరదలతో రూ.6,880 కోట్ల నష్టం


లలితా జ్యువెలిరీ మార్ట్ లిమిటెడ్ అధినేతగా ఎమ్ కిరణ్ కుమార్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులో లలిత్యా జ్యువెలర్స్‌ పేరిట ఆభరణాల వ్యాపారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. వరద బాధితుల కోసం రూ.1 కోటి విరాళం ప్రకటించారు. విరాళానికి సంబంధించిన చెక్కును విజయవాడ కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి అందించారు.


Also Read: YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్

విరాళం అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'కష్టాల్లో ఉన్న ఏపీకి నాకు తోచినంత కోటి విరాళం ఇచ్చా. నాలాంటి వ్యాపారస్తులు ఆంధ్రప్రదేశ్‌కు అండగా నిలివాలి. ఎవరికైనా తోచినంత సహాయం అందించాలి' అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై కిరణ్‌ కుమార్‌ ప్రశంసలు కురిపించారు. 76 ఏళ్ల వయసులో చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నారని తెలిపారు. అందరూ ఆయనకు తోడుగా నిలవాలని కోరారు.


కాగా వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడంతో దాతల నుంచి ఊహించని స్పందన లభిస్తోంది. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబును రాజకీయ పార్టీల నాయకులు, పలు వ్యాపార సంస్థల అధినేతలు, ఉద్యోగులు, ప్రముఖులు, కార్మిక సంఘాల నాయకులు కలిసి విరాళాలను అందిస్తున్నారు.


విరాళాలు అందించిన వారు ఇవే..


  • కాటూరి సుబ్బారావు రూ.10 కోట్లు

  • జాస్తి సుధా అండ్ వెంకట్ ఫ్యామిలీ రూ.5 కోట్లు

  • శ్రీ చైతన్య, శ్రీ కల్యాణ చక్రవర్తి మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ రూ.2 కోట్లు

  • విట్ ఛాన్సలర్ డా.విశ్వనాథమ్ రూ.1. 57 కోట్లు

  • మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రూ.కోటి

  • రవికుమార్ రెడ్డి, బపేశ్వరరావు (సుజలాన్ అండ్‌ యాక్సిస్ ఎనర్జీ) రూ. కోటి

  • సీఎం రాజేష్, సీఎం రిత్విక్ రూ.కోటి

  • కల్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్ర బాబు రూ.50 లక్షలు

  • విజయవాడ క్లబ్ తరఫున పి.చంద్రశేఖర్ రావు, శైలేష్, రాజా రూ.50 లక్షలు

  • టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి రూ.5 లక్షలు

  • కోటం సంధ్య రూ.5 లక్షలు

  • సిశ్వాన్ ఇన్ ఫ్రా రూ.5 లక్షలు

  • వై.చలపతి రావు రూ. లక్ష

  • పరుచూరి శ్రీనివాసరావు రూ. లక్ష

  • సీహెచ్ దీపిక రూ.లక్ష

  • స్వాతంత్య్ర సమరయోధులు-సర్వోదయ ట్రస్ట్ తరపున డా.మోహన్ కృష్ణ రూ.లక్షన్నర

  • బొప్ప అనురాధ రూ.లక్ష

  • తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ఒక రోజు మూల వేతనం. 

  • బి.అనురాధ రూ.లక్ష



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి